News April 1, 2026
HYD: నయా మస్తీ.. ‘కోల్డ్ బ్రూ’తో దోస్తీ!

టీ కొట్టు నుంచి కోల్డ్ బ్రూ వరకు.. కుర్రాళ్ల టేస్ట్ మారింది గురూ! ఇన్నేళ్లు రాజ్యమేలిన ఇరానీ ఛాయ్, ఫిల్టర్ కాఫీ ప్లేస్‌లో ‘కోల్డ్ బ్రూ’ చేరింది. కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్‌కే పరిమితం కాలేదు. గంటల కొద్దీ కాఫీ బీన్స్‌ను నానబెట్టి చేసే ఈ డికాక్షన్‌ను ఇంట్లోనే చేస్తూ ఫ్రెండ్స్‌తో షేర్ చేస్తున్నారు. కెఫిన్ కిక్ కంటే దాని మేకింగ్ ప్రాసెస్‌కే జెన్ జీ ఓటేస్తున్నారు. HYDలో ‘స్లో-కాఫీ’ కల్చరే హాట్ టాపిక్.
Similar News
News April 14, 2026
మూసీ ప్రక్షాళనకు అడుగులు.. DPR కోసం టెండర్ల ఆహ్వానం

మూసీ నదికి పునర్జీవం పోసేందుకు కసరత్తు మొదలైంది. బాపూఘాట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు గౌరెల్లి వరకు 34 కిలోమీటర్ల మేర నాలా సీవర్ మళ్లించి, శుద్ధి చేసేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం DPR తయారీకి MRDCL టెండర్లను ఆహ్వానించింది. గతంలో HMWSSB రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను లోతుగా సమీక్షించి, ఎక్కడైనా లోపాలు లేదా పునరావృత అంశాలు ఉన్నాయో? లేదో? కన్సల్టెంట్ సంస్థ గుర్తించాల్సి ఉంటుంది.
News April 14, 2026
HYDలో 40 దాటింది.. జాగ్రత్త!

HYDలో ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి. నాంపల్లి పరిధిలోని బేగంబజార్ ప్రాంతంలో మంగళవారం గరిష్ఠంగా 41.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ముషీరాబాద్, మారేడ్‌పల్లిలో, హిమాయత్‌నగర్ ప్రాంతంలో హిమాయత్‌నగర్ ప్రాంతంలో 40.5-40.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.
SHARE IT
News April 14, 2026
HYDతో అంబేడ్కర్‌కు విడదీయలేని అనుబంధం

Dr.BR.అంబేడ్కర్‌కి HYDతో విడదీయలేని అనుబంధం ఉంది. 1932లో తొలిసారి నగరానికి రాగా, 1944లో జింఖానా గ్రౌండ్స్‌లో బహిరంగ సభలో మాట్లాడి దళితులను చైతన్యపరిచారు. 1953లో నిజాం కాలేజీలో ఆయన ప్రసంగం విని ఆకర్షితుడైన నిజాం ఆయనను HYD స్టేట్‌కు చీఫ్ జస్టిస్‌గా నియమించాలనుకున్నారు. సామాజిక సంస్కరణలు, విద్యావ్యాప్తికి ఆయన పలుమార్లు ఇక్కడికి వచ్చారు. ట్యాంక్ బండ్‌పై ఆయన భారీ విగ్రహం నగరానికి ప్రతీకగా నిలిచింది.


