News April 9, 2025

HYD: నల్లాకు మోటర్‌ బిగిస్తే రూ.5 వేల జరిమానా!

image

నల్లాల నుంచి మోటార్ల ద్వారా నీటిని తోడితే కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి MD అశోక్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. HMWSSB ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి సుదూర ప్రాంతాల నుంచి నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తోందని, వృథా చేయకుండా వాటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కోరారు. నల్లాకు మోటర్‌ బిగిస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామన్నారు.

Similar News

News November 15, 2025

జగిత్యాల: మూడు రోజులు నీటిసరఫరా బంద్

image

జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి మండలం వెంకట్రావుపేటలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీతో మరమ్మతుల వల్ల 3 రోజులు నీటి సరఫరా నిలిపివేస్తామని కార్యనిర్వాహక ఇంజినీర్ M.జానకి తెలిపారు. ఈనెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గం (వెల్గటూర్, ధర్మారం, ఎండపల్లి మండలాలు మినహాయించి) పరిధిలోని గ్రామాలకు, మున్సిపాలిటీలకు మిషన్ భగీరథ నీరు అందించలేమని అన్నారు.

News November 15, 2025

యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 5

image

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (జ.నది)
25. రైతుకు ఏది ముఖ్యం? (జ.వాన)
26. బాటసారికి, రోగికి, గృహస్థునకు, చనిపోయిన వారికి బంధువులెవరు? (జ.సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)
27. ధర్మానికి ఆధారమేది? (జ.దయ)
28. కీర్తికి ఆశ్రయమేది? (జ.దానం)
29. దేవలోకానికి దారి ఏది? (జ.సత్యం)
<<-se>>#YakshaPrashnalu<<>>

News November 15, 2025

రామాయ‌ణంలోని ముఖ్య‌ ఘ‌ట్టంతో ‘వారణాసి’: రాజ‌మౌళి

image

మహేశ్ బాబుతో తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా గురించి SS రాజమౌళి కీలక విషయాలు వెల్లడించారు. ‘ఈ సినిమా మొద‌లు పెట్టేట‌ప్పుడు రామాయ‌ణంలో ముఖ్య‌మైన ఘ‌ట్టం తీస్తున్నాన‌ని అస్స‌లు అనుకోలేదు. కానీ ఒక్కొక్క డైలాగ్, ఒక్కో సీన్ రాస్తుంటే నేను నేల మీద న‌డ‌వ‌డం లేదు, గాల్లో ఉన్నాన‌ని అనిపించింది’ అని అన్నారు. మహేశ్‌కు రాముడి వేషం వేసి, ఫొటో షూట్ చేస్తుంటే గూస్‌బంప్స్ వ‌చ్చాయని తెలిపారు.