News April 10, 2025
HYD: నా భార్యను ఎన్కౌంటర్ చేయండి: చెన్నయ్య

అమీన్‌పూర్‌లో ముగ్గురు పిల్లలను తల్లి రజిత చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ ఘటనపై రజిత భర్త చెన్నయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రజిత నమ్మించి తన గొంతు కోసిందన్నారు. పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయినా తాను పిల్లల్ని బంగారంలా చూసుకునేవాడినని తెలిపారు. పిల్లల్ని చంపినందుకు కనీసం ఆమెకు పశ్చాత్తాపం లేదని.. రజిత, ప్రియుడు శివను ఎన్కౌంటర్ చేయాలన్నారు.
Similar News
News December 23, 2025
డిసెంబర్ 23: చరిత్రలో ఈ రోజు

☛ 1902: భారత మాజీ ప్రధాని చరణ్ సింగ్ జననం
☛ 1940: ప్రముఖ నవలా రచయిత ముదిగొండ శివప్రసాద్ జననం
☛ 1997: పండితుడు గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి మరణం
☛ 2004: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మరణం(ఫొటోలో)
☛ 2014: ప్రముఖ దర్శకుడు బాలచందర్ మరణం
☛ 2022: ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మరణం
– జాతీయ రైతు దినోత్సవం
News December 23, 2025
పాలమూరు: గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2026-27 విద్యాసంవత్సరం 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా సమన్వయకర్త బి.నాగమణి మాల తెలిపారు. జనవరి 21 వరకు ఆన్‌లైన్‌లో రూ.100 ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. అలాగే 6 నుంచి 9వ తరగతుల్లో ఖాళీల భర్తీకి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు.
News December 23, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


