News September 25, 2024

HYD: నిండుకుండలా హుస్సేన్‌సాగర్

image

నగరంలో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్‌సాగర్‌ నిండుకుండలా మారింది. ట్యాంక్‌బండ్ పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 513.41 మీటర్లకు చేరింది. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇన్​ఫ్లో ఎక్కువైతే గేట్లు తెరిచి నీటిని దిగువకు వదలనున్నారు. హైదరాబాద్‌కు వర్ష సూచన ఉండడంతో‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని GHMC అధికారులు సూచించారు.

Similar News

News September 29, 2024

అక్టోబర్ 1 నుంచి ఓయూ పీజీ పరీక్షలు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్షలను వచ్చే నెల 1 నుంచి నిర్వహించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంకామ్ (ఐఎస్), ఎంఎస్ డబ్ల్యూ, ఎంలిబ్ఎస్సీ, ఎంజేఅండ్ఎంసీ తదితర కోర్సుల మొదటి, మూడో సెమిస్టర్ బ్యాక్ లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షలను 1వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు వివరించారు.

News September 28, 2024

రేపు బర్కత్‌పురకు కేంద్రమంత్రి బండి సంజయ్ రాక

image

బర్కత్‌పురలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఉదయం 10:30 గంటలకు జరిగే ‘ బయోగ్రఫీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్రమోదీ’ కార్యక్రమంలో పాల్గొనడానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్, పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతంరావు తదితరులు వస్తున్నారని పార్టీ నేత కేశబోయిన శ్రీధర్ తెలిపారు.

News September 28, 2024

జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు భారం తగ్గేలా చర్యలు

image

ఏళ్లుగా HYD నుంచి ఉత్పత్తి అయ్యే చెత్తను జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్న విషయం తెలిసిందే. కాగా దానికి భారం తగ్గించేందుకు GHMC ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. మేడ్చల్, యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో స్థలాలను గుర్తిస్తోంది. RRజిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్‌లో 42.22 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం లక్డారంలో 100, దుండిగల్‌లో 85, మల్కాపూర్‌లో 200ఎకరాలను గుర్తించింది.