News August 29, 2025

HYD: నిందితుడి కస్టడీకి పోలీసుల పిటిషన్

image

కూకట్‌పల్లిలో జరిగిన సహస్ర హత్య కేసులో నిందితుడైన బాలుడిని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కూకట్‌పల్లి పోలీసులు మేడ్చల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆ బాలుడు సైదాబాద్‌లోని జువైనల్ హోమ్‌లో ఉండగా.. కేసు దర్యాప్తులో భాగంగా మరిన్ని వివరాలు సేకరించేందుకు కస్టడీ అవసరమని పోలీసులు కోర్టును కోరారు.

Similar News

News September 1, 2025

కలెక్టరేట్ ప్రజా సమస్యల వేదికకు 174 అర్జీలు

image

పుట్టపర్తి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 174 అర్జీలు అందినట్లు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఇందులో డివిజన్ల వారీగా చూస్తే పుట్టపర్తి- 67, పెనుకొండ- 51, ధర్మవరం- 41, కదిరి- 15 అర్జీలను స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.

News September 1, 2025

HYD: బీజేపీ నాటకంలో రేవంత్ రెడ్డి కీలుబొమ్మ: BRS MLA

image

బీజేపీ ఆడిస్తున్న నాటకంలో సీఎం రేవంత్ రెడ్డి కీలుబొమ్మగా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుందని కుత్బుల్లాపూర్ BRS ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగించడం, రేవంత్ రెడ్డి చేసే పనితీరు తదితర విషయాలన్నీ గమనిస్తే ఇది తేటతెల్లమవుతున్నట్లుగా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదన్నారు.

News September 1, 2025

దారుణంగా రహదారులు.. బిల్లులు ఇవ్వక ఇబ్బందులు

image

ఏఎంసీ రోడ్ల పనులపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వకపోవడంతో నెల్లూరు జిల్లాలో కీలక రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. 2022లో 222 రోడ్లను రూ.185.40 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు వచ్చినా, నిధుల సమస్యతో కాంట్రాక్టర్లు వెనక్కి తగ్గారు. ఇప్పటివరకు 51 పనులు మాత్రమే ప్రారంభమై 26 పూర్తి కాగా, 25 ఆగిపోయాయి. మిగతా 171 పనులు అసలు మొదలుకాలేదు. చేసిన పనులకే బిల్లులు ఇవ్వకపోవడంతో కొత్త పనులు చేయడం లేదు.