News December 15, 2025
HYD: నిజాం నీడలో నలిగిన తెలంగాణ: చిల్లర దేవుళ్లు

నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణ గ్రామీణం ఎదుర్కొన్న అణచివేతలను దాశరథి రంగాచార్యులు <<18569096>>చిల్లర దేవుళ్లులో<<>> హృదయవిదారకంగా చిత్రించారు. దొరలు, కర్ణం వ్యవస్థ, భూస్వాములు, వెట్టిచాకిరీ, మతమార్పిడులు, స్త్రీల వేదనల జీవితం కళ్లముందు కదులుతున్నట్లే ఇందులో వర్ణించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి ముందు నాటి దుర్భర సామాజిక పరిస్థితులను చరిత్రగా అక్షరీకరించారు. ఈ నవల చదువుతున్నంత సేపు నాటి సమాజంలో ఉన్నట్లే ఉంటుంది.
Similar News
News December 16, 2025
సింహాచలం కొండపై HT లైన్‌లకు గ్రీన్ సిగ్నల్

సింహాచలం కొండపై నుంచి NSEL వరకు HT విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఏపీ ట్రాన్స్‌కోకు అనుమతినిచ్చింది. ఈప్రాజెక్టులో భాగంగా దేవస్థాన భూముల్లో 27 టవర్ల లైన్లు వేయాల్సి ఉంది. ఇందుకుగాను వాడుకున్న స్థలానికి పరిహారంగా ట్రాన్స్‌కో ద్వారా దేవస్థానానికి రూ.15కోట్లు చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈపనులను వెంటనే పరిశీలించి, అనుమతులు మంజూరు చేయాలని ఆలయ ఈవోను ప్రభుత్వం ఆదేశించింది.
News December 16, 2025
3వ విడత.. 1100 మంది సిబ్బందితో బందోబస్తు

3వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్ఠమైన బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు CP సాయి చైతన్య వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు 1100 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సీపీ పేర్కొన్నారు.
News December 16, 2025
కర్నూలు: నడిరోడ్డుపై పసికందు.!

కర్నూలులో అమ్మ తనానికే మచ్చ తెచ్చే అవానవీయ ఘటన జరిగింది. నవ మాసాలు మోసి కన్న నెలలు నిండని పాపను రోడ్డుపై పడేసిందో కసాయి తల్లి. మంగళవారం ఉదయం నాలుగో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్ పేట రోడ్డుపై పాపను గుర్తించి సామాజిక కార్యకర్త అక్కున చేర్చుకున్నాడు. అనంతరం చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు.


