News September 5, 2025
HYD: నిమజ్జనం చేసిన లారీలు ఇలా వెళ్లాలి

ట్యాంక్ బండ్ వద్ద విగ్రహాలను తెచ్చిన లారీలు నిమజ్జనం పూర్తి చేసిన తర్వాత తిరిగి వెళ్లేందుకు ప్రత్యేక రూట్లను అధికారులు ఏర్పట్లు చేశారు. NTR మార్గ్‌లో నిమజ్జనం చేసినవి నెక్లెస్ రోటరీ, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, వీవీ స్టాట్యూ, కేసీపీల మీదుగా వెళ్లాలి. అప్పర్ ట్యాంక్ బండ్ నుంచి నిమజ్జనం చేసిన లారీలు చిల్డ్రన్స్ పార్క్, DBR మిల్స్, కవాడిగూడ, ముషీరాబాద్ మీదుగా వెళ్లాలన్నారు.
Similar News
News September 7, 2025
మేఘాద్రి గడ్డలో పడి ఇద్దరు యువకులు మృతి

మేఘాదిగడ్డ రిజర్వాయర్లో ఆదివారం ఇద్దరు యువకులు మృతి చెందారు. కార్మికనగర్, JNRM కాలనీకి చెందిన యువకులు చేపలు పట్టడానికి రిజర్వాయర్‌కి వచ్చారు. కింద పడిన చెప్పు తీసే క్రమంలో ప్రమాదవశాత్తు మునిగిపోయారు. వీరిలో బెల్లంకి శేఖర్, లక్ష్మణ్ కుమార్ చనిపోయారు. మరో యువకుడు వాసును స్థానికులు కాపాడారు. సమాచారం అందుకున్న పెందుర్తి సీఐ సతీశ్ కుమార్ తన సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను వెలికి తీశారు.
News September 7, 2025
వచ్చే ఎన్నికల నాటికి BRS కనుమరుగు: మహేశ్ గౌడ్

TG: బీసీ రిజర్వేషన్లపై కేంద్రం దిగి వచ్చేలా ఈ నెల 15న కామారెడ్డి సభ ఉండనుందని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. BJP నేతలు దేవుడి పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కుంటారని ఫైరయ్యారు. లిక్కర్ రాణిగా కవిత నిజామాబాద్‌కు చెడ్డపేరు తీసుకొచ్చారని విమర్శించారు. కవిత ఎపిసోడ్ KCR ఆడించే డ్రామా అని సందేహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని, వచ్చే ఎన్నికల నాటికి BRS కనుమరుగవుతుందన్నారు.
News September 7, 2025
జగిత్యాల: ‘రైతులు ఆందోళన చెందొద్దు’

జగిత్యాల జిల్లాలో ఈ సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు 6,37,177 బస్తాల యూరియాను పంపిణీ చేసినట్లు వ్యవసాయశాఖ అధికారి వి.భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శనివారం(నిన్న) వరకు 15,315 బస్తాల యూరియా నిల్వ ఉండగా, నేడు(ఆదివారం) మరో 15,100 బస్తాల యూరియా జిల్లాకు చేరుకుంటుందని అన్నారు. యూరియా కోసం రైతులు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.