News July 5, 2025

HYD: నిమజ్జనాల కోసం రెడీమేడ్ పాండ్స్ ఏర్పాటు

image

రాబోయే వినాయక చవితి సందర్భంగా చిన్న విగ్రహాల నిమజ్జనాల కోసం రెడీమేడ్ పాండ్స్ సరఫరా కోసం సంబంధిత ఏజెన్సీలను జీహెచ్ఎంసీ ఆహ్వానిస్తోంది. ప్రస్తుతానికి సికింద్రాబాద్ జోన్‌కు సంబంధించి 20 మీటర్ల పొడవు,10 మీటర్ల వెడల్పు, 1.32 మీటర్ల లోతుతో ఉండే పోర్టబుల్ పాండ్స్ తయారీ ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్ వెలువరించారు. కాగా POPతో చేసిన విగ్రహాలను నగరంలో నిమజ్జనం చేయరాదని హైకోర్టు తెలిపిన విషయం తెలిసిందే.

Similar News

News July 5, 2025

వరంగల్: ముమ్మరంగా సాగుతున్న రేషన్ కార్డుల సర్వే

image

కొత్త రేషన్ కార్డుల కొరకు వచ్చిన దరఖాస్తులపై అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలో 14,087 దరఖాస్తులు రాగా, 5,667 దరఖాస్తులను ఇప్పటికే పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే పూర్తయిన అనంతరం నూతన రేషన్ కార్డులు మంజూరు కానున్నాయి. సుమారు 12 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు కానుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News July 5, 2025

వరంగల్: రాష్ట్రంలోనే తొలి గిరిజన బతుకమ్మ తల్లి విగ్రహం మనదే!

image

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని పెద్ద తండాలో రాష్ట్రంలోనే తొలిసారిగా గిరిజన బతుకమ్మ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహ ఏర్పాటుకు తండాకు చెందిన లూనావత్ భిక్ష్య నాయక్ ఆర్థిక సహాయం అందించగా ఇటీవల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తమ తండాల్లో ఇలాంటి గిరిజన బతుకమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించినందుకు గాను పలువురు గిరిజనులు వారిని అభినందిస్తున్నారు. స్థానికులు విగ్రహాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు.

News July 5, 2025

మరో రెండు రోజులు గోదావరి వరద ఉద్ధృతి

image

గోదావరిలో వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. మరో రెండు రోజులు వరద ప్రవాహం ఇదే తరహాలో ఉంటుందని గోదావరి హెడ్ వర్క్స్ ఈఈ శ్రీనివాస్ తెలిపారు. సీలేరుతో కలిపి శనివారం గోదావరి ఇన్‌ఫ్లో 1,70,929 క్యూసెక్కుల నీరు వస్తుందన్నారు. 3 డెల్టాలకు సాగునీటి అవసరాల నిమిత్తం 12,100 క్యూసెక్కులు విడిచిపెడతామన్నారు. మిగిలిన 1,60,218 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలనున్నట్లు వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.