News September 20, 2025

HYD: నిమ్స్‌లో రికార్డు స్థాయిలో రోబోటిక్ సర్జరీలు

image

నిమ్స్ ఆసుపత్రి అత్యాధునిక రోబోటిక్ సర్జరీల్లో రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు 650కి పైగా రోబోటిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసింది. ఇందులో అత్యధికంగా యూరాలజీ విభాగంలో 370 మందికి చికిత్సలు అందించింది. అలాగే, గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆంకాలజీ విభాగాల్లోనూ ఈ ఈ సర్జరీలు చేస్తోంది. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు సీఎంఆర్‌ఎఫ్, ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోంది.

Similar News

News September 20, 2025

సీఎం నిర్ణయంతో ఉల్లి రైతుల‌కు భారీ ఊరట: మంత్రి భరత్

image

క‌ర్నూలు జిల్లా ఉల్లి రైతుల‌ను ఆదుకునేందుకు హెక్టారుకు రూ.50వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ప్రకటంచడంపై మంత్రి టీజీ భరత్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్ర‌బాబుకు మంత్రి కృత‌జ్న‌త‌లు తెలిపారు. ధ‌ర‌ల ప‌త‌నంతో న‌ష్ట‌పోతున్న రైతుల‌కు ఇది ఊర‌ట‌నిచ్చే నిర్ణ‌య‌మ‌ని అన్నారు. ఉల్లి రైతుల ఇబ్బందుల‌పై సీఎం చంద్ర‌బాబు తొలి నుంచి సమీక్షిస్తూ త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

News September 20, 2025

NLG: పండుగల వేళ.. ధరల షాక్

image

జిల్లాలో పండుగల ముందు నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. రోజురోజుకు నూనెలు, బియ్యం, కూరగాయల ధరలు పోటాపోటీగా పెరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ మొదలు కానుంది. ఆ తర్వాత పది రోజుల్లోనే దసరా పండుగ ఉంది. ఈ సమయంలో ధరల పెరుగుదల సామాన్య జనంలో ఆందోళన రేపుతున్నది. పల్లీ నూనె రూ.190 వరకు విక్రయిస్తున్నారు. కందిపప్పు KG రూ.220కు పైగానే ఉన్నది.

News September 20, 2025

YSR తాడిగడప మున్సిపాలిటీ పేరు మార్పు!

image

తాడిగడప మున్సిపాలిటీకి వైఎస్ఆర్ పేరును మారుస్తు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు ఆమోదం తెలిపారు. వైఎస్ఆర్ తాడిగడపకు బదులుగా తాడిగడప మున్సిపాలిటీగా చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.