News September 20, 2025

HYD: నిమ్స్‌లో 650కి పైగా రోబోటిక్ సర్జరీలు

image

నిమ్స్ ఆసుపత్రి అత్యాధునిక రోబోటిక్ సర్జరీల్లో రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు 650కి పైగా రోబోటిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసింది. ఇందులో అత్యధికంగా యూరాలజీ విభాగంలో 370 మందికి చికిత్సలు అందించింది. అలాగే, గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆంకాలజీ విభాగాల్లోనూ ఈ ఈ సర్జరీలు చేస్తోంది. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు సీఎంఆర్‌ఎఫ్, ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోంది.

Similar News

News September 20, 2025

HYD: చావు పిలుస్తోందంటూ సూసైడ్

image

భర్త చెరువులో దూకి సూసైడ్ చేసుకోగా.. తను లేకుండా ఉండలేనంటూ అదే చెరువులో దూకి భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. HYD రామాంతపూర్‌కు చెందిన సురేంద్ర తనను చావు పిలుస్తుందంటూ బీబీనగర్ చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపడుతుండగా సురేంద్ర భార్య సంధ్యారాణి ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు కాపాడారు. ‘అమ్మా నువ్వు చనిపోవద్దు’ అంటూ కొడుకు ఏడుపులు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.

News September 20, 2025

HYD: CMRF మోసం కేసులో ఏడుగురు అరెస్ట్

image

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ మోసానికి పాల్పడిన కేసులో పోలీసులు మరో ఏడుగురిని అరెస్టు చేశారు. నకిలీ దరఖాస్తులతో రూ. 8.71 లక్షలను అక్రమంగా విత్‌డ్రా చేసినట్లు గుర్తించారు. ప్రభుత్వాన్ని, నిజమైన బాధితులను మోసం చేసిన నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేయగా, మిగతా నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.

News September 20, 2025

HYD: ట్రేడింగ్ మోసం.. ఇద్దరి అరెస్ట్

image

నకిలీ ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసానికి పాల్పడిన ఇనమ్దార్ వినాయక రాజేంద్ర(నిఖిల్), రిషి తుషార్ అరోతే(విక్రంథ్)ను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా లింకులు, వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా బాధితులను ప్రలోభపెట్టి రూ. 32 లక్షల మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితులపై రాష్ట్రంలో 2 కేసులు, దేశవ్యాప్తంగా 12 కేసులు ఉన్నాయి. నిందితుల నుంచి 2 మొబైల్ ఫోన్స్, బైనాన్స్ ట్రాన్సాక్షన్ వివరాలు సీజ్ చేశారు.