News February 12, 2025

HYD: నిలోఫర్ డాక్టర్లు.. మీరు GREAT

image

ప్రాణాపాయ స్థితిలో ఉన్న 27 వారాల గర్భవతి వి.కవిత(35)కి HYD నీలోఫర్ వైద్యులు అరుదైన ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు. కవిత VKB జిల్లా వాసి కాగా.. ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుంది. మూత్రాశయం మీద ఉన్న చీలికలని వైద్యులు సరి చేశారు. 1KG మగ శిశువుకు జన్మనిచ్చింది.  ఈ క్రమంలో భారీగా రక్తం అవసరం పడిందని నిలోఫర్ సూపరింటెండెంట్ డా.రవి కుమార్ తెలిపారు. డాక్టర్లను మంత్రి రాజనర్సింహ అభినందించారు.

Similar News

News February 12, 2025

కొల్లిపరలో భారీ కొండ చిలువ 

image

కొల్లిపర మండలం పిడపర్తిపాలెంలో బుధవారం భారీ కొండచిలువ కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు ఆదాము ఉదయం పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. ఈ సమయంలో నిమ్మతోటలో భారీ కొండ చిలువ కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. ఊర్లోకి వెళ్లి గ్రామస్థులను తీసుకువచ్చి కొండ చిలువను పట్టుకొని కృష్ణానది పరీవాహక ప్రాంతంలో వదిలారు. తరచూ గ్రామంలో, పొలాల్లో కొండ చిలువలు కనిపిస్తుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. 

News February 12, 2025

గుంటూరులో నేటి చికెన్ ధరలు ఇవే!

image

గుంటూరు జిల్లాలో పొరుగు జిల్లాలతో పోల్చుకుంటే చికెన్ కి డిమాండ్ ఎక్కువగానే ఉంది. జిల్లాలో నేడు స్కిన్ లెస్ రూ.246, స్కిన్ రూ.236గా ఉంది. సాధారణ రోజుల్లో గుంటూరుకి ఇతర జిల్లాలకు 5, 10 రూపాయలు తేడా ఉండేది. కానీ ఇప్పుడు ఇతర జిల్లాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒకేసారి గుంటూరుకి ఇతర జిల్లాలకు రూ.20 నుంచి రూ.25 వ్యత్యాసం కనిపిస్తోంది.

News February 12, 2025

వరంగల్ మార్కెట్లో భారీగా పతనమైన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు పత్తి ధర భారీగా పతనమైంది. నిన్న మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,060 పలకగా.. నేడు రూ.6,950కి పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. ఒకరోజు వ్యవధిలోనే రూ.110 ధర తగ్గడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా అధికారులు, వ్యాపారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

error: Content is protected !!