News January 12, 2026
HYD: నీటితో ఆటలాడితే.. నల్లా కనెక్షన్ కట్

మహానగరంలో తాగునీటి వృథాను అరికట్టేందుకు జలమండలి చర్యలకు సిద్ధమైంది. వాహనాల వాషింగ్, గార్డెనింగ్, రోడ్లపై నీటిని వృథా చేస్తే రూ.2వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధించనుంది. 2సార్లు అవకాశం ఇచ్చి, ఆపై నల్లా కనెక్షన్ కట్ చేస్తారు. నీటి వృథాపై ఫొటో, లొకేషన్‌తో ‘పానీ యాప్’లో సమాచారం పంపేందుకు 10 వేల మంది వాటర్ వాలంటీర్లను రంగంలోకి దింపనున్నారు. 15 రోజుల్లో యాప్ అందుబాటులోకి రానుంది.
Similar News
News February 18, 2026
పాడేరు: ‘పింఛన్ పంపిణీలో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు’

పింఛన్ పంపిణీలో అలసత్వం వహించకూడదని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. పింఛన్ పంపిణీలో అవకతవకలు జరిగితే ఎంతటి అధికారికైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి రెండు జిల్లాల అధికారులతో వీసీ నిర్వహించారు. పింఛన్ పంపిణీలో ఐవీఆర్ఎస్ ద్వారా వచ్చే కాల్స్‌లో, లబ్దిదారులకు ఏ విధమైన ప్రశ్నకు సంతృప్తి చెందితే సమాధానంగా ఏ బటన్ ప్రెస్ చెయ్యాలో తెలియజేయాలని సూచించారు.
News February 18, 2026
ప్రమాదానికి ఏడాది.. మళ్లీ పనులు మొదలు

TG: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(SLBC) తవ్వకం మళ్లీ మొదలైంది. డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలో పనులు చేపట్టారు. గతేడాది ఫిబ్రవరిలో టీబీఎం మెషీన్‌తో తవ్వకాలు జరుపుతుండగా టన్నెల్ కూలిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు. దీంతో మెషీన్ తవ్వకాలు నిలిపివేసి బ్లాస్టింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని భద్రతా ప్రమాణాలు పాటించి పనులు కొనసాగించాలని అధికారులను ఆదేశించింది.
News February 18, 2026
తిరుపతి: మరోసారి మంచు విష్ణుకు నోటీసులు?

విద్యార్థి సంఘం నేతల <<19082321>>కిడ్నాప్<<>> కేసులో A-3 మంచు విష్ణుకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశముంది. ఇప్పటికే విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు అందజేయగా.. ఈ నెల 15 తర్వాత వస్తానని విష్ణు తెలిపారు. అయితే 17వ తేదీకి కూడా ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో మరోమారు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. హాజరు కాకపోవడానికి గల కారణాలపై స్పష్టత కోరుతూ సమన్లు జారీ అవకాశం ఉంది.


