News June 10, 2024

HYD: నీట్ పరీక్ష నిర్వహణపై సీబీఐ విచారణ జరిపించాలి: R.కృష్ణయ్య

image

జూన్ 4న విడుదలైన నీట్ పరీక్ష 2024 ఫలితాలు, నీట్ పరీక్ష నిర్వహణపై విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నందున, నీట్ పరీక్ష నిర్వహణ తీరుపై CBIచే విచారణ జరిపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ R.కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యార్థులందరికీ న్యాయం చేయాలని కోరారు. విద్యానగర్ హిందీ మాహా విద్యాలయం నుంచి BC భవన్ వరకు విద్యార్థులతో ఆయన ర్యాలీ నిర్వహించారు.

Similar News

News September 15, 2025

జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర: కేటీఆర్

image

జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర మొదలవ్వాలని KTR పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 13 లక్షల పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను ఆగం చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.

News September 15, 2025

జూబ్లీహిల్స్: ప్రతి బూత్‌కు 10 మంది

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ విజయం సాధించాలని సీఎం కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దాదాపు 407 బూత్‌లలో చురుకైన కార్యకర్తలను ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఒక్కో బూత్‌కు 10 మంది చొప్పున ఎంపిక చేసి హస్తానికే ఓట్లు దక్కేలా చూడాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ నెల 21లోపు ఎంపిక పూర్తిచేయనున్నారు.

News September 15, 2025

HYD: ఏళ్లకేళ్లుగా సిటీలోనే తిష్ట!

image

నగరంలోని మెడికల్ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న 64 మందికి ప్రభుత్వం అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించింది. వారిని ఇక్కడి నుంచి బదిలీలు చేయడం లేదు. జిల్లా కేంద్రాల్లో ఉన్న వారిని ఇక్కడికి తెచ్చి.. ఇక్కడున్న వారిని జిల్లా కేంద్రాలకు పంపాలని జిల్లాల్లోని వారు కోరుతున్నారు. అయితే ఏళ్లకేళ్లుగా ఇక్కడే తిష్టవేసుకొని ఉంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.