News September 2, 2025

HYD నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

HYD చర్లపల్లి నుంచి తిరుపతి మధ్య నడుస్తున్న స్పెషల్ ట్రైన్‌ను దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో నవంబర్ 26 వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి-తిరుపతి(07013) ట్రైన్ నవంబర్ 25 వరకు ప్రతి మంగళవారం నడుస్తుంది. అలాగే తిరుపతి-చర్లపల్లి (07014) రైలు నవంబర్ 26 వరకు ప్రతి బుధవారం ప్రయాణికులకు సేవలందించనుంది. ప్రయాణికులు ఈ విషయం గమనించాలని రైల్వే అధికారులు కోరారు.
SHARE IT

Similar News

News September 3, 2025

ఐదు రోజులు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు: కలెక్టర్

image

వ్యాధుల నిర్మూలన కోసం ఐదు రోజులపాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు పటిష్ట ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అంగన్‌వాడీ, పంచాయతీ భవన సముదాయాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. విధులు సరిగా నిర్వర్తించని వారిపైచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News September 3, 2025

శ్రీశైలంలో శివపార్వతుల కళ్యాణంపై హరికథ

image

శ్రీశైలం దేవస్థానంలో నిత్యం నిర్వహిస్తున్న నిత్య కళారాధన, ధర్మపథం కార్యక్రమంలో భాగంగా కర్నూలుకు చెందిన భాగవతారిణి లక్ష్మీ మహేశ్ బృందం ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం మీద నిర్వహించిన హరికథ గానం భక్తులను అలరించింది. మంగళవారం రాత్రి కళారాధన మండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రదర్శన అనంతరం కళాకారులకు స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి అభినందించారు.

News September 3, 2025

ఈ నెల 6న కర్నూలులో జిల్లాస్థాయి మారథాన్ పోటీలు

image

ఈనెల 6న ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు కర్నూలులో జిల్లాస్థాయి మారథాన్ 5 కిలోమీటర్ల పరుగు పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కర్ వెల్లడించారు. కర్నూలులోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో క్రీడా అధికారులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. 17 నుంచి 25 ఏళ్లు కలిగిన విద్యార్థులు, యువకులు, మహిళలు పాల్గొనవచ్చన్నారు. కార్యక్రమంలో డీఎస్డీఓ భూపతి పాల్గొన్నారు.