News September 11, 2025
HYD నుంచి హైస్పీడ్ రైళ్లు!

HYD నుంచి చెన్నయ్, బెంగళూరు, అమరావతికి వెళ్లాలంటే గంటల కొద్దీ ప్రయాణం చేయాలి. భవిష్యత్తులో ఈ బాధలు తప్పనున్నాయి. సిటీ నుంచి చెన్నయ్, బెంగళూరు, అమరావతికి హైస్పీడ్ రైళ్లు త్వరలో రానున్నాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే చెన్నయ్, బెంగళూరు లైన్లు ఓకే కాగా.. ఇప్పుడు అమరావతి రూట్ మ్యాప్ క్లియర్ అయిందని తెలిసింది. అన్నీ అనుకూలిస్తే ఆ సిటీలకు ఇక రయ్..రయ్..మంటూ వెళ్లడమే.
Similar News
News September 11, 2025
నిమ్స్‌కు క్యూ కడుతున్న రోగులు

నగరంలో ప్రతిష్ఠాత్మక నిమ్స్ ఆస్పత్రికి రోగులు క్యూ కడుతున్నారు. చికిత్స కోసం వేల మంది ఓపీకి వస్తుండటంతో ఆస్పత్రి కిటకిటలాడుతోంది. 3 రోజుల్లోనే దాదాపు 11,590 మంది వచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోమవారం 4,055 మంది, మంగళవారం 3,600 మంది వచ్చారు. ఇంత పెద్ద సంఖ్యలో రోగులురావడం నిమ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.
News September 11, 2025
సికింద్రాబాద్: కావేరీ సీడ్స్ వద్ద రైతులు నిరసన

సికింద్రాబాద్ పారడైస్‌లోని కావేరీ సీడ్స్ వద్ద ఛత్తీస్‌గఢ్ రైతులు గురువారం నిరసనకు దిగారు. కావేరి సీడ్స్ వేసి పంట నష్టపోయిన తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒక్కో ఎకరానికి రూ.12,000 చొప్పున పెట్టుబడి సహాయం కింద ఇచ్చారని పేర్కొన్న రైతులు ఒక్కో ఎకరానికి రూ.50 వేలు చెల్లించి నష్టాన్ని పూడ్చాలని కోరారు.
News September 11, 2025
HYD: సచివాలయంలో ఇంటర్నెట్ బంద్

సచివాలయంలో ఇంటర్నెట్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు శాఖల్లో పనులు స్తంభించాయి. ఉదయం నుంచి ఇంటర్నెట్ నిలిచిపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం నుంచి కేబుల్స్‌ను సిబ్బంది కట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.