News January 27, 2025

HYD: నుమాయిష్‌కు పోటెత్తిన సందర్శకులు

image

ఆదివారం సెలవు దినం కావడంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్‌కు సందర్శకులు పోటెత్తారు. గణతంత్ర వేడుకలు ఉండటంతో దాదాపు 80 వేల మంది సందర్శకులు వచ్చినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అటవీ, కార్మిక, జైళ్ల శాఖల స్టాళ్లలో ప్రభుత్వ పథకాలు, ప్రగతిపై సందర్శకులకు వివరించినట్లు పేర్కొన్నారు.

Similar News

News September 16, 2025

ప్రజావాణి పరిష్కార వివరాలను ఆన్‌లైన్లో పెట్టండి: రాధిక గుప్తా

image

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ జాప్యం లేకుండా సత్వరమే అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని మేడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో 113 అర్జీలు అందాయన్నారు. గతవారం అర్జీల పరిష్కార వివరాలను ఆన్‌లైన్లో ఉంచాలని ఆదేశించారు. ప్రజావాణిపై ప్రజలకు నమ్మకం కలిగేలా అధికారులు పనిచేయాలని సూచించారు.

News September 16, 2025

ప్రజాపాలన దినోత్సవ ముఖ్య అతిథి ఉత్తమ్

image

ఈనెల 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరగనుంది. సూర్యాపేట కలెక్టరేట్‌లో జరిగే వేడుకలకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు.

News September 16, 2025

ఇచ్ఛాపురం: అతిథి అధ్యాపక పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానం

image

ఇచ్ఛాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒడియా అతిథి అధ్యాపక పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస రావు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 20వ తేదీ లోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సెప్టెంబర్ 22న ఉదయం 10 గం.లకు ఇంటర్వ్యూ ఉంటుందని, MA (ఒడియా)లో 50% మార్కులు, NET, Ph.D అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.