News February 16, 2025
HYD: నుమాయిష్‌కు రేపే లాస్ట్

HYDలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్‌కు సందర్శకులు పోటెత్తుతున్నారు. రేపు చివరి రోజు కావడంతో నుమాయిష్‌ను సందర్శించేందుకు భారీగా తరలివస్తున్నారు. శనివారం రికార్డు స్థాయిలో 90 వేల మందికి పైగా సందర్శకులు వచ్చినట్లు సొసైటీ బుకింగ్ కమిటీ కన్వీనర్ సత్యేందర్, ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి సురేందర్ రెడ్డి తెలిపారు. జనవరి 3వ తేదీన ప్రారంభమైన నుమాయిష్ రేపటితో ముగియనున్న విషయం తెలిసిందే.
Similar News
News December 15, 2025
అనంతపురం జిల్లా TDP నేత మృతి

అనంతపురం జిల్లా టీడీపీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి, రాయదుర్గం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు జి.లోకానంద సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాయదుర్గం పట్టణానికి చెందిన లోకానంద లీగల్ సెల్‌లో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆయన మృతిపై టీడీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
News December 15, 2025
‘AGRATE’ ఏం చేస్తుంది?

‘AGRATE’ చిన్న రైతులకు నాణ్యమైన విత్తనాలు, డ్రిప్ ఇరిగేషన్, ఆధునిక వ్యవసాయ పరికరాలు, సేంద్రియ ఎరువులను తక్కువ ధరకే అందిస్తోంది. అలాగే కొమ్మలను అంటుకట్టడం, ఎక్కువ పంటల సాగు, స్థిరమైన వ్యవసాయ విధానాలపై రైతులకు ఆధునిక శిక్షణ ఇవ్వడంతో పంట దిగుబడి పెరిగింది. ITC, Godrej, Parle వంటి కంపెనీలతో శుక్లా ఒప్పందం చేసుకోవడంతో రైతుల ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు పెరిగి వారి ఆదాయం గణనీయంగా పెరిగింది.
News December 15, 2025
ఈ నెల 19న శోభన్ బాబు ‘సోగ్గాడు’ రీరిలీజ్

టాలీవుడ్ సీనియర్ హీరో శోభన్ బాబు నటించిన ‘సోగ్గాడు’ చిత్రం ఈ నెల 19న రీరిలీజ్ కానుంది. చిత్రం విడుదలై 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అదే రోజున HYDలో స్వర్ణోత్సవ వేడుకను నిర్వహించనున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్‌కు ఈ మూవీ మంచి పేరు తీసుకొచ్చిందని నిర్మాత సురేశ్ బాబు తెలిపారు. నటుడిగానే కాకుండా వ్యక్తిగానూ శోభన్ బాబుకు ప్రత్యేక స్థానం ఉందని సీనియర్ నటుడు మురళీమోహన్ అన్నారు.


