News January 15, 2025

HYD: నుమాయిష్‌లో పోలీసుల బందోబస్తు

image

HYDలోని నాంపల్లి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన నుమాయిష్‌కు సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నుమాయిష్‌కు వచ్చే సందర్శకులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోజూ ముగ్గురు ఏసీపీలు, 9 మంది ఇన్‌స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ బృందాలతో బందోబస్తు, తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Similar News

News February 1, 2026

రంగారెడ్డి: నూతన సర్పంచుల శిక్షణా షెడ్యూల్‌లో మార్పులు

image

ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచుల శిక్షణా తరగతుల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. మున్సిపాల్ ఎన్నికల కారణంగా కొత్త షెడ్యూల్ విడుదలైంది. మూడో విడత శిక్షణ ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు, నాల్గో విడత ట్రైనింగ్ మార్చి 2 నుంచి 7 వరకు, ఐదో విడత శిక్షణ మార్చి 9 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు. అప్పటివరకు సర్పంచులు గ్రామాభివృద్ధి పనుల్లో నిమగ్నం కావాలన్నారు.

News February 1, 2026

GHMC: రూ.11,460 కోట్ల బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం

image

2026-27 ఆర్థిక ఏడాది బడ్జెట్‌ను కౌన్సిల్‌లో జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టింది. GHMC మొత్తం బడ్జెట్ రూ.11,460 కోట్లుగా పేర్కొంది. ఆదాయం రూ.6,441 కోట్లు, జీహెచ్ఎంసీ ఖర్చు రూ.4,057 కోట్లు, రెవెన్యూ మిగులు రూ.2,384 కోట్లు, రెవెన్యూ గ్రాంట్స్ రూ.400 కోట్లు, కొత్తగా విలీనమైన మున్సిపాలిటీల కోసం రూ.2,260 కోట్లను కేటాయించింది. విలీనమైన 27 మున్సిపాలిటీల నుంచి వచ్చిన రెవెన్యూ రూ.1,860 కోట్లుగా పేర్కొంది.

News January 31, 2026

రంగారెడ్డి: అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్

image

ఈ నెల 15న వరుసగా ఇళ్లల్లో చోరీలు చేసి పరారైన అంతరాష్ట్ర దొంగలను శుక్రవారం మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్లు DCP సురేష్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన మహాదేవ్ ఝా (A-1), పవన్ గుప్తా (A-2), కాన్పూర్‌కు చెందిన మంగళ్ సింగ్ (A-3)లు బోడుప్పల్ పరిధిలోని 9 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. 250 గ్రాముల బంగారం, 6 కిలోల వెండి, రూ.2 లక్షల నగదును దోచుకొని పరారైనట్లు తెలిపారు.