News March 5, 2026

HYD: నేటి నుంచి 1Oth హాల్ టికెట్స్

image

రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు నేటి నుంచి అధికారిక వెబ్‌సైట్‌ <>bse.telangana.gov.in<<>>లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని నాంపల్లి SSC బోర్డు ప్రకటించింది. మార్చి 14- ఏప్రిల్ 16 వరకు ఉ.9:30 నుంచి మ.12:30 వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ముందుగానే సెంటర్ తెలుసుకుని నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.

Similar News

News March 7, 2026

HYDకు చేరువలో అద్భుతమైన అందాలు.. వెళ్దామా?

image

HYD నగరానికి చేరువలో నల్లమల అడవుల అందాలను ఆస్వాదించాలనుకునే వారికి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ వేదికగా నిలుస్తోంది. ఇక్కడి ‘మన్ననూర్ జంగిల్ రిసార్ట్’లో పులుల సఫారీ, పక్షుల కిలకిలరావాల మధ్య ఉదయం ట్రెక్కింగ్ వంటివి పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి. స్థానిక చెంచులతో కలిసి అడవి రహస్యాలను తెలుసుకునే వీలుంది. ఆధునిక వసతులు, భోజన సౌకర్యాలతో కూడిన ఈ పర్యాటక ప్యాకేజీ కోసం <>ఇక్కడ క్లిక్ <<>>చేయండి.

News March 6, 2026

HYD: సివిల్స్‌లో సత్తా చాటిన ఉమ్మడి రంగారెడ్డి బిడ్డలు

image

సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అభ్యర్థులు సత్తా చాటారు. రాష్ట్రం నుంచి ఎంపికైన మొత్తం 20 మందిలో 8 మంది మన జిల్లాలకు చెందిన వారే కావడం విశేషం. లక్ష్మిరచన 178వ ర్యాంక్, మెరుగు కౌశిక్ 399, ప్రీతీ రాపర్తి 468, విక్రమ్ సింహా రెడ్డి 682, విజయ్ సింహా రెడ్డి 682, శ్రీరామ్ హర్ష 823, ప్రత్యూష 908, దీపక్ శర్మ 951, ఉత్తమ ర్యాంకులు సాధించారు.

News March 6, 2026

గచ్చిబౌలి: గ్యాస్‌ బెలూన్‌ పేలి నలుగురికి గాయాలు

image

గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్‌ శాంతి సరోవర్‌ ప్రాంగణంలో శుక్రవారం గ్యాస్‌ బెలూన్‌ పేలి నలుగురు గాయపడ్డారు. ఓ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన హీలియం బెలూన్‌ ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.