News April 13, 2026
HYD: నేడు ఈ రూట్లో NO ENTRY

ఉప్పల్‌లో నేడు జరిగే IPL మ్యాచ్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఉప్పల్ రింగ్ రోడ్డులో భారీ వాహనాలకు నో ఎంట్రీ. లారీలు, డంపర్లు, ట్రక్కులు, టిప్పర్లు, ఎర్త్ మూవర్స్, వాటర్ ట్యాంకర్లు, RMC వాహనాలు, JCBలు, ఐచర్ వ్యాన్లు, ప్రైవేట్ బస్సులు, ట్రాక్టర్ల రాకపోకలు నిషేధించారు. డైవర్షన్ మార్గాలు వినియోగించాలని పోలీసులు సూచించారు.
Similar News
News April 13, 2026
విద్యావ్యవస్థను లోకేశ్ గాలికొదిలేశారు: వైసీపీ

AP: ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ విమర్శించింది. ‘ఫీజులు ఇప్పుడు కడతారా.. ఆ తర్వాత వడ్డీతో కలిపి కడతారా? అంటూ కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరిస్తున్నాయి. విద్యావ్యవస్థను గాలికొదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగంతో లోకేశ్ కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు’ అని ట్వీట్ చేసింది.
News April 13, 2026
చేపల చెరువుల్లో నీటి పీహెచ్ స్థాయి ఎంత ఉండాలి?

☛ చేపలు ఎక్కువగా పీహెచ్ స్థాయి 7.0-8.5 మధ్య ఉన్న చెరువు నీటిలో బాగా పెరుగుతాయి. ☛ చెరువులో నీటి పీహెచ్ స్థాయి 6.5 కన్నా తక్కువైతే (ఆమ్ల ధర్మం గల నీరు) చేపలు బలహీనమై, వ్యాధుల బారినపడతాయి. ☛ చెరువులో నీటి పీహెచ్ స్థాయి 9 కన్నా ఎక్కువైతే (క్షార ధర్మం గల నీరు) చేపల మొప్పలు దెబ్బతిని, ప్రాణ వాయువుని గ్రహించే శక్తి చేపల్లో తగ్గుతుంది. అందుకే నీటి పీహెచ్ స్థాయిని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.
News April 13, 2026
అనకాపల్లి: ఆటోను ఢీకొట్టిన లారీ.. ఆరుగురికి గాయాలు

ఎలమంచిలి నుంచి అనకాపల్లి వెళ్తోన్న ఆటోను కశింకోట మండలం పరవాడపాలెం వంతెన మీద సోమవారం లారీ ఢీకొంది. ఆగి ఉన్న ఆటోలో నుంచి ప్రయాణికులు దిగుతుండగా లారీ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


