News February 2, 2025
HYD: నేడు కాంగ్రెస్ నిరసనలు

కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్షకు నిరసనగా నేడు ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నాను నిర్వహించనుంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. బడ్జెట్లో తెలంగాణ పట్ల చూపిన వివక్షను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Similar News
News September 18, 2025
ఈనెల 20న నల్గొండలో జాబ్ మేళా

నల్గొండ జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు పలు ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలను కల్పించుటకు ఈనెల 20న ఉదయం 10-30 గంటలకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయములో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఎంపిక కాబడిన వారు నల్గొండ, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పనిచేయవలసి ఉంటుందని తెలిపారు.
News September 18, 2025
NLG: పత్తికి క్వింటాకు రూ.8110లు మద్దతు ధర

ఆరుగాలం శ్రమించే అన్నదాతకు అండగా నిలిచేందుకు అడిషనల్ కలెక్టర్ ఇవాళ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 7 పత్తి కేంద్రాల కింద 24 సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పత్తికి క్వింటాకు రూ.8110లు మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని తెలిపారు. సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలలో 8 నుంచి 12 శాతం లోపు తేమశాతం కలిగి నాణ్యమైన పత్తిని కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.
News September 18, 2025
రాయికల్‌లో ‘లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర’

లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్రలో భాగంగా గురువారం రాయికల్ మండలంలోని ఒడ్డేలింగాపూర్ గిరిజన బాలికల మినీ గురుకుల పాఠశాలను తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ రైట్స్ & రాజ్యాధికార సాధన కన్వీనర్ డా. విశారదన్ మహారాజ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లల క్లాస్ రూములను పరిశీలించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లలతో భారత రాజ్యాంగ పీఠికను చదివించారు. కార్యక్రమంలో డీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.