News September 14, 2025

HYD: నేడు గాంధీ మెడికల్ కాలేజీ వ్యవస్థాపక దినోత్సవం

image

సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కళాశాల నేటికి 71 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గాంధీ కళాశాల ప్రాంగణంలోని అలుమ్ని భవనంలో వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు డా.జీఆర్ లింగమూర్తి, వెంకటరత్నంలు తెలిపారు. కాగా.. గాంధీ మెడికల్ కళాశాల దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ఆస్పత్రిగా నిలిచింది.

Similar News

News September 14, 2025

కృష్ణాపురం నవోదయలో ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ దాష్టీకం

image

మర్రిపాడు మండలం కృష్ణాపురంలోని జవహర్ నవోదయ స్కూల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి స్టడీ అవర్స్‌లో మహేష్ అనే విద్యార్థిపై ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ పెత్తన స్వామి దాడికి పాల్పడ్డారు. దీంతో మహేశ్‌ తలకు తీవ్ర గాయం అయ్యింది. అంతటితో ఆగకుండా ఆ విద్యార్థిని వాష్ రూమ్‌లో లాక్ చేసిన ఉదయం వరకు లాక్ తియ్యొద్దని స్టాఫ్‌ని హెచ్చరించారు. టీచర్లు కలిసి విద్యార్థిని మర్రిపాడు ఆస్పత్రికి తరలించారు.

News September 14, 2025

కరీంనగర్: బీరు ప్రేమికులకు గుడ్ న్యూస్

image

బీరు ప్రేమికులకు గుడ్ న్యూస్. ఇప్పటివరకు HYD లోనే పరిమితమైన మైక్రో బ్రూవరీలు ఇప్పుడు కరీంనగర్, రామగుండం వంటి ద్వితీయశ్రేణి నగరాల్లో కూడా ఏర్పాటు చేయనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఈ నగరాల్లో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఎక్సైజ్ శాఖ లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏర్పాటుకు ఆసక్తి ఉన్న వారు SEP 25న సా.5 గం.లోపు KNR ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

News September 14, 2025

సంగారెడ్డి: సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.1.50 కోట్లు రికవరీ

image

జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా సైబర్ క్రైమ్ కేసుల కింద రూ.1.50 కోట్లు రికవరీ చేసినట్లు సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. క్షణికావేశంలో చేసిన తప్పులకు లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం పొందవచ్చని అన్నారు. సైబర్ బాధితులకు న్యాయం అందించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిరంతరం కృషి చేస్తుందని ఎస్పీ పేర్కొన్నారు.