News April 12, 2025
HYD: నేడు మద్యం దుకాణాలు బంద్

హనుమాన్ జయంతి సందర్భంగా జంట నగరాలు.. HYD, సికింద్రాబాద్‌లో మద్యం దుకాణాలను మూసేయాలని పోలీసు శాఖ తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కల్లు కాంపౌండ్లు, వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉండే బార్లను బంద్ చేయాలని సూచించింది. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా మద్యం అమ్మకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Similar News
News April 13, 2025
Orange: HYDలో సరిపోయింది ఈ శనివారం

ఈ శనివారం HYD వాసులకు గుర్తుండిపోయే రోజు. వీర హనుమాన్ విజయయాత్ర జరిగిన నగరంలోనే ఆరెంజ్ ఆర్మీ జైత్ర యాత్ర కొనసాగింది. ఉదయం నుంచి ఓ ఆర్మీ జై శ్రీరామ్ నినాదాలతో HYDను హోరెత్తించగా.. మరో ఆర్మీ ఉప్పల్ స్టేడియంలో చెలరేగిపోయింది. ఎటు చూసినా కాషాయజెండాలే దర్శనమిచ్చాయి. భక్తుల పూజలు, హనుమంతుడి అనుగ్రహంతో ఆరెంజ్ ఆర్మీ ఘన విజయం సాధించిందని హైదరాబాద్ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News April 13, 2025
HYD: ప్రశాంతంగా ముగిసిన యాత్ర

నగరంలో శ్రీ వీర హనుమాన్ విజయయాత్ర శాంతియుతంగా ముగిసింది. ఏకంగా 17,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీ సీవీ ఆనంద్ పర్యవేక్షణలో డ్రోన్‌లు, సీసీటీవీలతో పర్యవేక్షణ జరిగింది. 45 ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, జాయింట్ కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని శాఖల సమన్వయంతో యాత్ర నిర్వహించారు. ప్రజలు, నిర్వాహకుల సహకారంతో యాత్ర ప్రశాంతంగా ముగిసిందని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
News April 12, 2025
తాడ్‌బండ్ టెంపుల్‌లో హీరోయిన్ ప్రీతి జింటా

ప్రముఖ సినీనటి, IPL పంజాబ్ కింగ్స్ జట్టు యజమాని ప్రీతి జింటా తాడ్‌బండ్‌ను సందర్శించారు. హనుమాన్ జయంతి సందర్భంగా వీరాంజనేయ స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనున్న నేపథ్యంలో ఆమె ఆలయానికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఆమె మాస్కు ధరించినట్లు తెలుస్తోంది.