News September 13, 2025
HYD: నేడు, రేపు MSME బిజినెస్ ఎక్స్‌పో

BNI హైదరాబాద్ ప్రతినిధులు అనిరుధ్ కొణిజేటి బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సెప్టెంబర్ 13, 14న శంషాబాద్‌లో MSME ఎక్స్‌పో నిర్వహిస్తామని తెలిపారు. BNI ఆధ్వర్యంలో జరిగే ఈ ఎక్స్‌పోలో చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల ఉత్పత్తులు, సేవలు ప్రదర్శించబడనున్నట్లు వివరించారు. ఎక్స్‌పో విశేషాలను సీఎంకు వివరిస్తామని చెప్పారు.
Similar News
News April 15, 2026
TODAY HEADLINES

☛ అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రారంభం
☛ రేపు ఏపీ ఇంటర్ ఫలితాలు
☛ ‘మహిళా బిల్లు’.. జగన్‌కు చంద్రబాబు లేఖ
☛ సీట్లు పెంచకుండా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి: రేవంత్
☛ ఎండలు.. ప్రజలు 11AM-3PM వరకు బయటకు రావొద్దు: సీతక్క
☛ బిహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి
☛ ఇరాన్‌తో రెండు రోజుల్లో మరోసారి చర్చలు: ట్రంప్
☛ IPL: KKRపై CSK విజయం
News April 15, 2026
విమానంలో ఫోన్ వాడితే డేంజరా?

విమానంలో ప్రయాణికుల ఫోన్లను కచ్చితంగా ఫ్లైట్ మోడ్‌లో పెట్టుకోమంటారు. అలా చేయకపోతే డేంజరనే భయం కొందరిలో ఉంటుంది. అయితే ఫోన్ ఫ్లైట్ మోడ్‌లో లేనంత మాత్రాన ప్లేన్ కూలిపోదని, కానీ కొంత రిస్క్ ఉందంటున్నారు పైలట్లు. ‘ఫ్లైట్ మోడ్‌లో లేకుంటే ఫోన్లు సిగ్నల్స్ రాబట్టేందుకు యత్నిస్తాయి. పైలట్ల హెడ్‌సెట్స్‌కు వచ్చే రేడియో వేవ్స్ డిస్ట్రబ్ అయ్యి శబ్దం వస్తుంది. ఫలితంగా ఏకాగ్రత దెబ్బతింటుంది’ అని చెబుతున్నారు.
News April 15, 2026
హార్దిక్ నిర్ణయాలపై రోహిత్ సంతృప్తిగా లేరు: మాజీ క్రికెటర్

హార్దిక్ చెత్త నిర్ణయాల వల్లే RCB చేతిలో ముంబై ఓడిపోయిందని మాజీ క్రికెటర్ సడగొప్పన్ రమేశ్ అభిప్రాయపడ్డారు. ‘MIకి హార్దిక్ కెప్టెన్సీనే పెద్ద సమస్య. 7, 8వ ఓవర్లు వరుసగా స్పిన్నర్లకు ఇచ్చాడు. పాటీదార్ ఉన్నప్పుడు ఇలా చేయడం పెద్ద తప్పు. డేవిడ్‌కు హై ఫుల్ టాస్ వేసి DRSకు వెళ్లడంతో సూర్య షాకయ్యాడు. అటు రోహిత్ కూడా హార్దిక్ నిర్ణయాలపై సంతృప్తిగా లేనట్లు క్లియర్‌గా కనిపించింది’ అని తెలిపారు.


