News March 9, 2026
HYD: నేడు స్కాట్లాండ్‌తో భారత్ ఢీ

మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ 2026లో భాగంగా నేడు భారత్, స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో ఈ కీలక మ్యాచ్ జరగనుంది. పూల్-బీలో ఇప్పటికే ఒక విజయం సాధించిన భారత మహిళల జట్టు రెండో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు స్కాట్లాండ్ జట్టు కీలక పాయింట్ల కోసం పోరాడనుంది. ఉత్కంఠభరితంగా సాగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 గం.కు ప్రారంభం కానుంది.
Similar News
News March 9, 2026
నర్సీపట్నం: చెరువులో దూకి తల్లీకుమారుడి ఆత్మహత్య?

తూ.గో కోటనందూరు(M) కాకరపల్లి శివారు తమ్మయ్య చెరువులో సోమవారం గుర్తుతెలియని మహిళ, సుమారు మూడేళ్ల బాలుడి మృతదేహాలు లభ్యమవ్వడం కలకలం రేపింది. మృతులు నర్సీపట్నం ప్రాంతానికి చెందిన భాగ్యలక్ష్మి(35), ఆమె కుమారుడు సాయి(3)గా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల వల్ల భాగ్యలక్ష్మి కుమారుడితో సహా ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు CI చెన్నకేశవరావు తెలిపారు.
News March 9, 2026
వంటగ్యాస్ బుకింగ్ పీరియడ్ 25 రోజులకు పెంపు

గ్యాస్ సిలిండర్ల హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బుకింగ్ పీరియడ్‌ను 21 నుంచి 25 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కొందరు గతంలో 55 రోజులకు ఓసారి బుక్ చేసుకుంటే ఇప్పుడు 15 రోజులకే చేసుకుంటున్నారని తెలిపింది. LPG ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలను ఆదేశించినట్లు వెల్లడించింది. కమర్షియల్ కంటే గృహ అవసరాలకే ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించింది.
News March 9, 2026
జలుమూరులో యాక్సిడెంట్..ఒకరు స్పాట్ డెడ్

జలుమూరు మండలం లింగాలపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం..లింగాలపాడుకు చెందిన సూర్యనారాయణ (79) సోమవారం ఉదయం బహిర్భూమికి వెళ్లి వస్తుండగా నరసన్నపేట వైపు వెళ్తున్న టాటా ఏసీ వాహనం ఢీకొనడంతో తలకు గాయమై తీవ్ర రక్తస్రావమైంది. అనంతరం వృద్ధుడు అపస్మారక స్థితికి చేరుకొని ప్రాణాలను వదిలాడు. ఎస్సై అశోక్ బాబు కేసు నమోదు చేశారు.


