News January 27, 2025
HYD: నేడు హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి

HYD బుద్ధభవన్‌లో గల హైడ్రా కార్యాలయంలో నేడు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గం. వరకు ఫిర్యాదులను స్వీకరించనున్నారు. ప్రభుత్వ భూముల కబ్జాలు, అక్రమ కట్టడాలు తదితర అంశాలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. కాగా.. ప్రజల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
Similar News
News July 4, 2025
రేపు స్కూళ్లకు సెలవు ఉందా? లేదా?

AP: మొహర్రం సందర్భంగా రేపటి ఆప్షనల్ హాలిడేపై స్పష్టత ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ ఆప్షనల్ సెలవును స్కూళ్లు వాడుకోవచ్చా? లేదా? అనే సందిగ్ధత నెలకొందని, విద్యాశాఖ స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి. గత వారంలో రథయాత్రకు సెలవు ప్రకటించి, చివరి నిమిషంలో రద్దు చేశారని పేర్కొంటున్నాయి. రేపటి ఆప్షనల్ సెలవుపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలని కోరుతున్నాయి.
News July 4, 2025
తణుకులో అత్యధిక వర్షపాతం నమోదు

గడచిన 24 గంటల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 34.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. జిల్లాలో అత్యధికంగా తణుకు మండలంలో 12.2, ఆచంట 5.2, పెంటపాడు 4.2, పోడూరు 3.6 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. యలమంచిలి, పాలకొల్లు, నరసాపురం, మొగల్తూరు, కాళ్ల, భీమవరం, వీరవాసరం మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదని వెల్లడించారు.
News July 4, 2025
ములుగు జిల్లాలో నేటి నుంచి పోలీస్ యాక్ట్ అమలు

ములుగు జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా నెల రోజుల(4 నుంచి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ శబరీశ్ తెలిపారు. పోలీసు అధికారులకు ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బందులు చేపట్టొద్దన్నారు. వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు బలవంతంగా మూసివేసేందుకు ప్రయత్నిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.