News November 19, 2025
HYD: నేడు PG, PhD రెండో విడత కౌన్సెలింగ్

రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2025- 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన PG & PhD ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ నేడు జరగనుంది. యూనివర్సిటీ ఆడిటోరియంలో మ.3 గం.కు నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు హాజరుకావాలని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News December 8, 2025
3,131 ఉద్యోగాలు.. BIG UPDATE

SSC CHSL-2025 టైర్-1 ఆన్‌లైన్ పరీక్షల కీ విడుదలైంది. అభ్యర్థులు https://ssc.gov.in/లో రిజిస్ట్రేషన్, పాస్‌వర్డ్‌తో లాగినై కీ, రెస్పాన్స్‌షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఒక్కో ప్రశ్నకు రూ.50 చెల్లించి అభ్యంతరాలను తెలపవచ్చు. కాగా 3,131 ఉద్యోగాలకు నవంబర్ 12 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
News December 8, 2025
పుట్టపర్తి: PGRSకు 331 అర్జీలు.!

పుట్టపర్తి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీల సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. పీజీఆర్ఎస్‌కు 331 అర్జీలు వచ్చాయని, వీటిలో భూ సమస్యలు, పింఛన్ సమస్యలపై అధికంగా ఫిర్యాదులు పొందడం జరిగిందన్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
News December 8, 2025
వికాసం పెంపొందించేందుకు కృషిచేయాలి: కలెక్టర్

ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో మానసిక వికాసాన్ని పెంపొందించేందుకు కృషిచేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్టూడెంట్ వెల్ నెస్ కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్వో అప్పయ్య, సంక్షేమ అధికారి జయంతి, డీఐ ఈఓ గోపాల్, డీటీడీవో ప్రేమకళ ఇతర అధికారులు పాల్గొన్నారు.


