News September 12, 2025

HYD: నేడే Ed.CET సెకండ్ ఫేజ్ రిజల్ట్స్

image

Ed.CET 2025 సెకండ్ ఫేజ్ పరీక్ష ఫలితాలు నేడు వెలువడనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. నేడు సాయంత్రం వరకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సీటు పొందిన కాలేజీల వారిగా ఫలితాలు విడుదల చేస్తామని, విద్యార్థులందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు.

Similar News

News September 12, 2025

మంచిర్యాల: ఐటీఐలలో వాక్ ఇన్ అడ్మిషన్లు

image

మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు వాక్ ఇన్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ వై.రమేష్ తెలిపారు. నాలుగవ దశ ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు నేరుగా హాజరు కావచ్చునని ఆయన చెప్పారు. గతంలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఉదయం 9 గంటలకు కళాశాలకు రావాలని ఆయన సూచించారు.

News September 12, 2025

తూర్పుగోదావరి కలెక్టర్‌గా నర్సీపట్నం యువతి

image

నర్సీపట్నానికి చెందిన యువతి చేకూరి కీర్తి తూర్పుగోదావరి కలెక్టర్ అయ్యారు. ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీర్తిని కలెక్టర్‌గా తూర్పుగోదావరికి బదిలీ చేసింది. ఆమె చెన్నైలో ఐఐటీ చేసి ఐఆర్ఎస్ రాసి మొదటగా కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. ఆ తర్వాత ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. ఐఏఎస్ హోదాలో వివిధ జిల్లాలో పనిచేసిన ఆమె తూర్పుగోదావరి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

News September 12, 2025

MLHP సస్పెండ్.. DMHOకు కలెక్టర్ ఆదేశాలు

image

ఆత్మకూరు మం. కూరెళ్లలోని పల్లె దవాఖానను కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా MLHP డాక్టర్ అశోక్‌ విధుల్లో లేకపోవడాన్ని ఆయన గమనించారు. కాగా, ఆయన రోజూ సరిగ్గా విధులకు హాజరుకావట్లేదని తెలుసుకున్న కలెక్టర్ వెంటనే MLHPని సస్పెండ్ చేయాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.