News February 3, 2026

HYD: నేరాలు చేస్తాం.. ప్రశ్నించవద్దంటే ఎలా..?: CM

image

ప్రజల నుంచి తిరస్కారం పొందిన నేటితరం నేతలకు పదవి వ్యామోహం పోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పదవులన్నీ కేసీఆర్ కుటుంబం అనుభవించిందని పేర్కొన్నారు. వందల ఎకరాల ఫాంహౌస్, రూ.వేల కోట్ల వ్యాపారాలు మీకు ఎలా వచ్చాయని CM ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు చేయాల్సిన తప్పులన్నీ చేశారని మండిపడ్డారు.

Similar News

News February 18, 2026

HYD: షాద్‌నగర్ యాక్సిడెంట్‌లో చనిపోయింది వీరే..!

image

షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద <<19172186>>అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. కాగా, అరుణాచలం నుంచి HYD తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఇన్నోవా క్రిస్టాను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుర్కయంజాల్‌కు చెందిన పురుషోత్తం రెడ్డి, మధుసూదన్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘనటపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 18, 2026

FSLలో కొలువులు.. NOTIFICATION వచ్చేసింది..!

image

TG ఫోరెన్సిక్ ల్యాబ్(FSL) ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకు గమనిక. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తిచేసుకున్న వారిలో 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను రాతపరీక్షలకు ఎంపిక చేశారు. MAR 5,6,7 తేదీల్లో మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో పరీక్షలు జరగనున్నాయి. షార్ట్ లిస్ట్ కానివారు రూ.500 ఫీజు చెల్లించి FEB 21వ తేదీ ఉదయం 8గంటల వరకు ఆన్‌లైన్‌లో తమ అభ్యంతరాలు తెలపవచ్చు. హాల్ టికెట్ల వివరాలు త్వరలో వెల్లడిస్తారు.

News February 18, 2026

‘భాగ్య’నగరంలో ఉద్యమించిన ధ్రువతార

image

అంబేడ్కర్‌ సన్నిహితుడు మన హైదరాబాదీ మాదరి భాగయ్య. అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక. కుల వివక్షను ప్రశ్నిస్తూ, సమాజంలో గౌరవ సూచకంగా భావించిన ‘రెడ్డి’, ‘వర్మ’లను తన పేరులో చేర్చుకుని భాగ్యరెడ్డి వర్మగా ప్రసిద్ధి చెందారు. దేవదాసీ వ్యవస్థ, నిజాం పాలనలో వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆది హిందూ చైతన్యానికి బలమైన పునాదులు వేశారు. దళిత హక్కుల కోసం పోరాడి చరిత్రకెక్కారు.
#నేడు ఆయన వర్ధంతి.