News September 5, 2025

HYD: నేరెళ్ల ఇస్కాన్ ప్రాజెక్టుకు రోడ్డు వసతికి వినతి

image

ప్రజాభవన్లో ఇస్కాన్ ప్రతినిధులను మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో 18 ఎకరాల్లో గోశాల, అన్నదాన సత్రం, సేంద్రియ వ్యవసాయం, సోలార్ విద్యుత్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఇస్కాన్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. రహదారి వసతి కల్పించాలని చేసిన విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.

Similar News

News September 5, 2025

HYDలో మురుగు శుద్ధి ఇక వేగవంతం

image

నగరంలో మురుగుశుద్ధి ప్రక్రియ వేగవంతం కానుంది. 39 ఎస్టీపీలను ఏర్పాటు చేయాలని జలమండలి నిర్ణయించింది. ఈ పనులు దసరాలోగా ప్రారంభిస్తామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. బొంగలూరు, తెల్లాపూర్, రావిర్యాల్, ఇక్రిశాట్, కాప్రా, మాసబ్‌ట్యాంక్, బాచుగూడ, మీర్పేట, తిమ్మక్క చెరువు, హెచ్పీఎస్, చిత్రపురి కాలనీ, పీర్జాదిగూడ, నాగారం, నార్సింగి, బాపూఘాట్, హైదర్షా కోట, ఫతేనగర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామన్నారు.

News September 5, 2025

HYD: ‘NIRF ర్యాంక్..OU UPDATE!

image

✒జాతీయస్థాయిలో 53వ స్థానంలో నిలిచింది✒2024లో 73వ స్థానం నుంచి ఏడాదిలోనే 17 స్థానాలు ఎగబాకింది✒విశ్వవిద్యాలయాల విభాగంలో 2024లో ఉన్న 43వ స్థానం నుంచి 13స్థానాలు మెరుగుపరుచుకుని 30వ ర్యాంకు సాధించింది.✒వర్సిటీ హెచ్‌ ఇండెక్స్ 121కి చేరింది.✒రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని విశ్వవిద్యాలయాల విభాగంలో దేశంలో ఓయూ 7వ స్థానంలో నిలిచింది.✒సైటేషన్లు 15,000 నుంచి 90,000కు పెరిగాయన్నారు

News September 5, 2025

రేపటి ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే

image

నిమజ్జన వేడుక సందర్భంగా రేపు నగరంలో రేపు ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ వాహనాలను మళ్లించి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ ఆంక్షలపై నగర ప్రజలకు పూర్తి సమాచారం ఇచ్చేందుకు హెల్ప్ లైన్ నంబర్లు పోలీసు అధికారులు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ మళ్లింపులకు సంబంధించి ప్రజలు 9010203626, 8712660600, 040-2785248 నంబర్లకు కాల్ చేయవచ్చు.