News January 16, 2026
HYD: నైట్ ఫ్లైఓవర్లు బంద్!

‘షబ్-ఏ-మేరాజ్’ సందర్భంగా HYDలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. వాహనదారుల భద్రత కోసం ఈ రోజు రా.10 గం. నుంచి రేపు ఉదయం వరకు గ్రీన్‌ల్యాండ్స్, PVNR ఎక్స్‌ప్రెస్‌వే, లంగర్‌హౌస్ మినహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు, నెక్లెస్ రోడ్ మూసేస్తున్నట్లు జాయింట్ CP జోయల్ డేవిస్ తెలిపారు. షేక్‌పేట్, బహదూర్‌పురా ఫ్లైఓవర్లను అవసరాన్ని బట్టి ఓపెన్ చేస్తారు. అత్యవసరమైతే 9010203626 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
Similar News
News January 29, 2026
గూగుల్ డేటా సెంటర్‌కు FEBలో శంకుస్థాపన!

AP: విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు పనులు తుది దశకు చేరుకున్నాయని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ తెలిపారు. FEBలోనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగే అవకాశాలున్నాయన్నారు. ఆనందపురం(M) తర్లువాడ వద్ద డేటా సెంటర్ కోసం 308 ఎకరాల భూమిని సిద్ధం చేసినట్లు తెలిపారు. భూసేకరణలో 51 మంది డీపట్టా రైతుల్లో 49 మంది భూములిచ్చేందుకు అంగీకరించారని, మిగిలిన వారు 2-3 రోజుల్లో ఇవ్వనున్నట్లు చెప్పారు.
News January 29, 2026
ఏలూరు: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ-బెంగళూరుకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖ-బెంగళూరు(08581) FEB 1-22 వరకు ప్రతి ఆదివారం, (08582) నంబర్ రైలు FEB 2-23 వరకు ప్రతి సోమవారం నడుస్తుందని తెలిపారు. విశాఖ, దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరులో ఆగనున్నట్లు సమాచారం.
News January 29, 2026
నెల్లూరు: 4 గవర్నమెంట్ ఉద్యోగాలు..!

ఓ ప్రభుత్వ ఉద్యోగం రావడమే కష్టమవుతున్న ఈ రోజుల్లో ఓ యువకుడు 4 ఉద్యోగాలు సాధించాడు. అనంతసాగరం(M) కొత్తపల్లికి చెందిన హెడ్ కానిస్టేబుల్ మస్తాన్ కుమారుడు లాల్ అహమ్మద్ బీటెక్ చదివాడు. 2019లో పంచాయతీ కార్యదర్శిగా, తర్వాత జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ సాధించారు. ప్రస్తుతం మనుబోలు MRO ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తుండగా.. గ్రూప్-2లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు.


