News February 20, 2025

HYD: నోరూరిస్తున్న తిరొక్క రకాల మామిడి పండ్లు

image

వేసవి వేళ HYD నగరానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన తీరొక్క రకాల మామిడి పండ్లు దర్శనమిస్తున్నాయి. HYD శివారులోని బాటసింగారం మార్కెట్లో కొనుగోలు జోరందుకోగా కొత్తపేట, నాగోల్, ఉప్పల్ ప్రాంతాల్లో అనార్కలీ, జాఫ్రాన్, ఫరేబి, కోకోనట్‌లైన్, తోతాపూరి, లంగడా సేఫేది లాంటి రకాల మామిడి పండ్లను వ్యాపారులు విక్రయిస్తున్నారు. వేసవి అంటేనే మామిడి పండ్లు కాగా..రకాన్ని బట్టి రూ.80 నుంచి రూ.120కిలో అమ్ముతున్నారు.

Similar News

News November 8, 2025

సిరిసిల్ల నుంచి ప్రత్యేక బస్సు

image

సిరిసిల్ల నుండి ఏపీలోని పలు పుణ్యక్షేత్రాల సందర్శనకు ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ నెల 14న మధ్యాహ్నం సిరిసిల్లలో బయలుదేరే బస్సు ద్వారక తిరుమల, పిఠాపురం, అన్నవరం. సింహాచలం, కైలాసగిరి, కనకమహాలక్ష్మి దేవాలయం సందర్శన అనంతరం 16న రాత్రి సిరిసిల్ల చేరుకుంటుందని, పెద్దలకు రూ.2900, పిల్లలకు రూ.2030 చార్జి ఉంటుందని, భోజన వసతి ఖర్చులు ప్రయాణికులే భరించుకోవాలని డిపో మేనేజర్ ప్రకాష్ తెలిపారు.

News November 8, 2025

పెసర, మినుము పంటల్లో విత్తనశుద్ధికి సూచనలు

image

పెసర, మినుములో చీడపీడల నివారణకు విత్తనశుద్ధి కీలకం. అందుకే విత్తడానికి ముందు ఒక కిలో విత్తనానికి 3గ్రా. మ్యాంకోజెబ్ మందుతో విత్తనశుద్ధి చేసి తర్వాత 5 గ్రాముల థయోమిథాక్సామ్ లేదా 5ml ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తనశుద్ధి చేసి విత్తితే తొలిదశలో ఆశించే రసంపీల్చే పురుగులు, తెగుళ్ల నుంచి పంటను కాపాడవచ్చు. చివరగా విత్తే ముందు ఎకరానికి 200గ్రా. రైజోబియం కల్చర్‌ను 10 కిలోల విత్తనానికి పట్టించి విత్తుకోవాలి.

News November 8, 2025

నెలకు రూ.10 లక్షలు కావాలా?.. షమీ మాజీ భార్యపై ఫైర్

image

తనకు నెలకు రూ.4 లక్షల భరణం సరిపోవట్లేదని, రూ.10 లక్షలు కావాలని షమీ మాజీ భార్య జహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. విడాకుల తర్వాత మళ్లీ మాజీ భర్తపై ఆధారపడటం ఎందుకని, సొంతకాళ్లపై నిలబడటం రాదా అని ప్రశ్నిస్తున్నారు. మెయింటెనెన్స్ అనేది కాస్ట్ ఆఫ్ లివింగ్, పిల్లల ఖర్చు ప్రకారం ఉండాలని, ఆదాయం ఆధారంగా కాదని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?