News March 30, 2025

HYD: పంజాగుట్ట కేసు.. ఇన్‌స్టా రీల్స్‌లో మార్పు!

image

బెట్టింగ్ ప్రమోషన్స్ వ్యవహారంలో సజ్జనార్ ఉద్యమంతో పంజాగుట్ట PSలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో గతంలో తెలిసి తెలియక ప్రమోట్ చేసిన వారే ఇప్పుడు బెట్టింగ్‌కు వ్యతిరేకంగా పోస్ట్‌లు చేస్తున్నారు. డబ్బులు తగలబెట్టి మరీ ఈజీగా మనీ సంపాదించవచ్చు అని అమాయకులను ప్రలోభ పెట్టినవారు HYD పోలీసుల చర్యలతో పరారీ అవుతున్నారు. ఇక ఇన్‌స్టా రీల్స్‌లోనూ జనాలను మభ్య పెట్టే ప్రమోషన్స్ తగ్గడం విశేషం.

Similar News

News April 1, 2025

MARCH: రికార్డు స్థాయిలో UPI పేమెంట్స్

image

దేశంలో డిజిటల్ పేమెంట్స్ సరికొత్త గరిష్ఠాలను తాకాయి. మార్చిలో రూ.24.77లక్షల కోట్ల UPI పేమెంట్స్ జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) వెల్లడించింది. 18.3 బిలియన్ల ట్రాన్సాక్షన్స్ నమోదయ్యాయంది. వరుసగా 11 నెలల నుంచి ప్రతినెలా రూ.20లక్షల కోట్లకు పైగా పేమెంట్స్ జరగడం విశేషం. JAN-MAR క్వార్టర్‌లో రూ.70.2లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే ఇది 24% అధికం.

News April 1, 2025

SRPT: పొట్టకూటి కోసం వెళ్తే మృత్యువు వెంటాడింది

image

పొట్టకూటి కోసం కూలికి వెళ్లిన వృద్ధురాలిని కారు రూపంలో మృత్యువు కాటేసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన ఆలువల స్వరాజ్యం(60) కూలి పని కోసం ఆటోలో కుంటపల్లికి వచ్చింది. ఆటో దిగి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టారు.

News April 1, 2025

భారీ భూకంపం.. భవన శిథిలాల కింద 400 మంది!

image

భూకంపం వల్ల ఇటీవల బ్యాంకాక్ అల్లకల్లోలమైన విషయం తెలిసిందే. అక్కడి ఓ 30 అంతస్తుల భవనం కుప్పకూలగా, దాని కింద 74మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. అయితే ఆ శిథిలాల్లో 300-400 మంది చిక్కుకొని చనిపోయి ఉంటారని జాతీయ మీడియా పేర్కొంది. ఇప్పటి వరకు ఆ శిథిలాల నుంచి 13 మృతదేహాలను వెలికి తీశారు. ఇటీవల మయన్మార్‌లో రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో భారీ భూకంపం రాగా, బ్యాంకాక్‌పై అది తీవ్ర ప్రభావం చూపింది.

error: Content is protected !!