News December 29, 2024

HYD: పచ్చదనమే మన సంతోషం, ఆరోగ్యం..!

image

పచ్చదనమే మనకు సంతోషం, ఆరోగ్యాన్ని అందిస్తుందని IFS అధికారి మోహన్ అన్నారు. HYDలో బిజీ బిజీగా గడిపే ప్రజలు, వారానికి ఒకసారైనా పచ్చని వాతావరణంలో సేద తీరితే, మనసు నిశ్చలంగా ఉండటమే కాక, శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచి మార్గమన్నారు. పట్టణాలకు, పల్లెలకు తేడా మనం గమనిస్తూనే ఉంటామని, అందుకే అందరూ మొక్కలు నాటడానికి ముందుకు రావాలన్నారు. మరి మీ ప్రాంతంలో ప్రకృతి అందాలు ఉన్నాయా? కామెంట్ చేయండి.

Similar News

News January 2, 2025

సికింద్రాబాద్: 2024లో 1,194 కిలోల గంజాయి పట్టివేత

image

2024లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ పరిధిలో 1,194 కిలోల గంజా‌ను పట్టుకున్నారు. ప్రభుత్వ రైల్వే పోలీసు(GRP) అధికారులు రూ.2.98 కోట్ల విలువైన గంజాయిగా గుర్తించారు. 38 కేసులలో 53 వ్యాపారులు అరెస్టయ్యారని SP చందన తెలిపారు. జీఆర్పీ పోలీస్ స్టేషన్ గంజాయి రవాణాపై నిఘా పెట్టి తనిఖీలు చేస్తున్నట్లు తెలిపింది.

News January 1, 2025

HYD: 2024లో 1,656 మంది మృతి

image

HYD నగరం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రై కమిషనరేట్ల పరిధిలో 2024 ఏడాదిలో 10,748 ప్రమాదాలు జరగగా..1,656 మంది ప్రాణాలు కోల్పోయారు. 9,092 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. HYD, సైబరాబాద్ పరిధిలో పాదాచారులే 350 మంది మరణించడం గమనార్హం. HYD పరిధిలో 775 మంది పాదాచార్యులు ప్రమాదాల్లో గాయపడ్డట్లు వార్షిక రిపోర్టు వెల్లడించింది.

News January 1, 2025

సికింద్రాబాద్: 84 మంది పిల్లలను రక్షించిన RPF

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో 2024లో “ఆపరేషన్ స్మైల్” “ముస్కాన్” కార్యక్రమాల ద్వారా 84 పిల్లలను రక్షించారు. ఇందులో 59 బాలురు, 25 బాలికలు ఉన్నారు. రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ (RPF), చైల్డ్ లైన్ స‌హా వివిధ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యాచరణను చేపట్టాయి. ఈ కార్యక్రమం ద్వారా బాల కార్మికులుగా పని చేస్తున్న పిల్లలను హత్తుకు చేర్చుకున్నారు.