News December 22, 2025

HYD: పదేపదే బెదిరింపులు.. తనిఖీల్లో వేగం పెంపు

image

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకు బాంబు బెదిరింపులు వరుసగా వస్తున్నాయి. కేవలం ఒక నెలలోనే ఏడుసార్లు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌కు వస్తున్న విమానంలో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్ పంపడంతో భద్రతా చర్యలలో భాగంగా విమానాలను దారి మళ్లించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా సంపూర్ణ తనిఖీలు నిర్వహించారు.

Similar News

News December 22, 2025

ప్రభాకర్ రావును విచారించనున్న సజ్జనార్!

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. కస్టోడియల్ విచారణలో ఉన్న ప్రభాకర్ రావును విచారించేందుకు CP సజ్జనార్ రెడీ అయినట్టు తెలుస్తోంది. ముందుగా ఛార్జిషీట్ వేసి తర్వాత కేసుతో సంబంధం ఉన్న వారందరినీ విచారించనున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు నిందితులను ACP, DCP, జాయింట్ సీపీ స్థాయి అధికారులే విచారించారు. కమిషనర్ స్థాయిలో ఉన్న సజ్జనార్ నిందితుడిని విచారించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.

News December 22, 2025

నేడు ప్రజా అర్జీలు స్వీకరించనున్న బాపట్ల కలెక్టర్

image

బాపట్ల కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే PGRSకు జిల్లాస్థాయి అధికారులు అందరూ హాజరు కావాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు PGRS అర్జీలపై జిల్లా అధికారులతో సమావేశం ఉంటుందన్నారు. ప్రతి డివిజన్, మండల రెవెన్యూ కార్యాలయాలలో అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News December 22, 2025

నేడు నెక్లెస్ రోడ్డులో ‘మాక్ డ్రిల్’

image

ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేలా సోమవారం నెక్లెస్ రోడ్ వ్యూ ప్రాంతంలో ‘మాక్ ఎక్సర్సైజ్’ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ డీఆర్ఓ వెంకటాచారి తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లో అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, హైడ్రా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. విపత్తు వేళ వివిధ శాఖలు సమన్వయంతో ఎలా స్పందించాలనే అంశంపై ఈ విన్యాసాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.