News September 7, 2025
HYD: పదేళ్లు కాంగ్రెస్‌ను అధికారంలో ఉంచేందుకు శ్రమిస్తున్నా: మహేశ్ కుమార్

పదేళ్ల తర్వాత పవర్‌లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని పదేళ్ల పాటు అధికారంలో ఉంచేందుకు శ్రమిస్తున్నానని MLC, TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ HYDలో అన్నారు. KCRను గద్దె దించేందుకు ప్రత్యేక స్ట్రాటజీ అమలు చేశామని, CM రేవంత్ రెడ్డికి,తనకు కెమెస్ట్రీ బాగా కుదిరిందన్నారు. ఇద్దరి అభిప్రాయాలు ఏకీకృతమవుతున్నాయని చెప్పారు. అధికారంలోకి వచ్చాక అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని జోడెద్దుల్లా ముందుకు నడుపుతున్నామన్నారు.
Similar News
News September 8, 2025
సైబర్ నేరాలపై అవగాహన ఉండాలి: వరంగల్ సీపీ

ప్రతి ఒక్కరికి సైబర్ నేరాలపై తప్పక అవగాహన కలిగి ఉండాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 56 కేసులు నమోదు కాగా.. ఇందులో 50 ఫైనాన్స్ కేసులు, 6 నాన్ ఫైనాన్స్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. చాలా వరకు చదువుకున్న వారే సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోతున్నట్లు తెలిపారు. ఎవరైనా మోసపోతే తక్షణమే 1930కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
News September 8, 2025
వీసా రూల్స్ మార్చిన US.. భారతీయులకు మరిన్ని కష్టాలు!

అమెరికా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా(NIV)ల కోసం స్వదేశంలోనే అప్లై చేసుకోవాలని స్పష్టం చేసింది. అంటే గతంలో మాదిరిగా థాయ్‌లాండ్, సింగపూర్ వంటి ఇతర దేశాల ఎంబసీల్లో ఇంటర్వ్యూకు హాజరవ్వలేరు. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా ఎంబసీల్లోనే షెడ్యూలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో US వెళ్లాలనుకున్న, షార్ట్ టర్మ్ వీసాతో ఉన్న భారతీయులకు ఇబ్బందులు తప్పవు.
News September 8, 2025
జగిత్యాల: తెలంగాణ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సత్యనారాయణ

తెలంగాణ నీట్ పేరెంట్స్ అసోసియేషన్–2025 అధ్యక్షుడిగా సత్యనారాయణ చారి ఎన్నికయ్యారు. నీట్ సమస్యలపై పోరాడేందుకు సోమవారం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా రమేష్ లను, అలాగే ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. నీట్‌లో తెలంగాణ పిల్లలకు జరుగుతున్న నష్టంపై పోరాడేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.