News October 6, 2025

HYD: పదేళ్ల KCR పాలనలో అభివృద్ధి లేదు: మంత్రి

image

HYD జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 100% బీసీకే టికెట్ వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఇప్పటికే పర్యటన చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞతతో ఓటు వేస్తారని, ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. KCR పదేళ్ల పాలనలో జూబ్లీహిల్స్ అభివృద్ధికి దూరమైందని, కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు.

Similar News

News October 7, 2025

HYD: ‘108’లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

108 అంబులెన్స్‌లో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని HYD జిల్లా మేనేజర్ నవీన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రైవర్ ఉద్యోగానికి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాడ్జ్ నంబర్ కలిగి ఉండాలన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన వారు ఈనెల 7న మంగళవారం కింగ్ కోఠీలోని GOVT ఆసుపత్రి 108 ఆఫీస్‌లో దరఖాస్తులు అందజేయాలని కోరారు. వివరాలకు 9100799259, 9676120894 నంబర్లకు కాల్ చేయాలన్నారు.

News October 7, 2025

జూబ్లీహిల్స్‌లో బస్తీ యాత్ర చేపడతాం: టీపీసీసీ చీఫ్

image

HYD జూబ్లీహిల్స్‌లో బస్తీ యాత్ర చేపడతామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. సోమవారం HYDలో ఆయన మాట్లాడారు. ఈ యాత్రలో ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌తోపాటు ముగ్గురు మంత్రులు పాల్గొంటారని వెల్లడించారు. అజహరుద్దీన్ జూబ్లీహిల్స్ టికెట్ రేసులో లేరని, ఆయన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అవుతారని తెలిపారు. ఎంఐఎం మద్దతు ఇంకా స్పష్టంగా లేదని పేర్కొన్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. మీ కామెంట్?

News October 7, 2025

HYD: ఇక.. ఆర్టీసీ డ్రైవర్లకు సీటు బెల్ట్ తప్పనిసరి..!

image

HYD నగరం సహా రాష్ట్రంలోని అనేక డిపోల పరిధిలో అన్ని ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లు, ఫ్రంట్ సీట్ ప్యాసింజర్లకు సీటు బెల్టులు పెట్టుకోవడం తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ డిపో మేనేజర్ల ఆధ్వర్యంలో బస్సుల్లో డ్రైవర్ సీట్లు, ఫ్రంట్ సీట్ ప్యాసింజర్ సీట్లకు సీటు బెల్టులు అమరుస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. త్వరలోనే మిగతా ప్రాంతాలకు సైతం ఈ నిబంధన విస్తరిస్తామని ఎండీ నాగిరెడ్డి తెలిపారు.