News January 5, 2026

HYD: పన్నుల లెక్క.. ఎవరి పవర్ ఎంత?

image

GHMC 300 వార్డుల పరిధిలో ఆస్తి పన్ను పంపిణీపై క్లారిటీ వచ్చేసింది. 10 వేల చదరపు అడుగుల లోపు ఇల్లు లేదా ప్లాట్ అయితే DC చూసుకుంటారు. అంతకంటే ఒక్క అడుగు ఎక్కువ ఉన్నా ఫైలు నేరుగా ZC టేబుల్‌పైకి వెళ్లాల్సిందే. 5ఏళ్ల కంటే పాత బకాయిల అడ్జస్ట్మెంట్ వ్యవహారాల్లోనూ ZC గ్రీన్ సిగ్నల్ తప్పనిసరి. చిన్న మార్పులకు లోకల్ ఆఫీసర్ సరిపోతారు. కానీ, పెద్ద ప్రాపర్టీల లెక్క మాత్రం జోనల్ లెవల్లోనే తేలుతుంది.

Similar News

News February 21, 2026

జూబ్లీహిల్స్‌లో Mukunda Jewellers ప్రారంభం

image

జూబ్లీహిల్స్‌లో ప్రముఖ జ్యువెలర్స్ Mukunda Jewellers తన తొలి ఫ్యాక్టరీ అవుట్‌లెట్‌ను ఫిబ్రవరి 20న ఘనంగా ప్రారంభించింది. మధ్యవర్తులు లేకుండా నేరుగా తయారీ ధరలకే వజ్రం, బంగారం, వెండి ఆభరణాలు అందించడం ప్రత్యేకత. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్, గౌరవ అతిథిగా కార్పొరేటర్ వెంకటేశ్ హాజరై ప్రారంభించారు. జూబ్లీహిల్స్ వాసులకు నాణ్యమైన పొదుపు అవకాశంగా ఈ అవుట్‌ లెట్ నిలువనున్నట్లు యాజమాన్యం తెలిపింది.

News February 21, 2026

హైదరాబాద్ ‘ఫ్యూచర్’ ఇదే!

image

ఫ్యూచర్ సిటీ (FCDA) పరిధిలో ఆకాశమే హద్దుగా భవనాలు ఎగబాకనున్నాయి. సర్కారు ‘యూనిఫైడ్ బిల్డింగ్ రూల్స్ 2026’ను పట్టాలెక్కించింది. పాత TG-bPASS సర్కారు అటకెక్కిపోవడంతో ఇక అంతా ‘బిల్డ్ నౌ’ ప్లాట్ ఫామ్‌లోనే. ముచ్చర్ల AI సిటీలో కట్టే బిల్డింగ్‌లకు రోడ్డు వెడల్పుతో సంబంధం లేకుండా 60 అంతస్తులపైనే పర్మిషన్లు ఇచ్చేలా నిబంధనలు సడలించారు. అయితే, ఈ బిల్డింగ్‌లు ‘నెట్ జీరో’ పాలసీని పాటించాలని కండీషన్ పెట్టారు.

News February 21, 2026

HYD: కమాండ్ కంట్రోల్ మెయింటెనెన్స్‌కు రూ.8.35 కోట్లు

image

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఐకానిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. మూడేళ్ల పాటు ఈ భవనాన్ని అద్దాల మేడలా మెరిపించేందుకు రూ.8.35 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ఇందులో భాగంగా 24/7 టెక్ సపోర్ట్, మెకనైజ్డ్ క్లీనింగ్, గ్లాస్ ఫెసాడ్ మెయింటెనెన్స్ పనులు చేపట్టనున్నారు. నగర గర్వకారణమైన ఈ టవర్ ఎల్లప్పుడూ అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు.