News March 27, 2025
HYD: పర్యాటక శాఖ ఆధ్వర్యంలో టూర్

తెలంగాణ పర్యాటకశాఖ ప్యాకేజీలను సిద్ధం చేస్తోంది. HYD నుంచి పలు కొత్త పర్యాటక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకురానుంది. ఏపీ, తమిళనాడు, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లోని ఊటీ, అరకు తదితర ప్రముఖ పర్యాటక ప్రదేశాలను చుట్టేసేలా వీటిని రూపొందిస్తున్నారు. పర్యాటకుల డిమాండ్ ఆధారంగా ప్యాకేజీలను అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ ప్యాకేజీలు ప్రారంభం కానున్నాయి.
Similar News
News December 26, 2025
అనంత: జనవరిలో గోధుమ పిండి పంపిణీ

అనంతపురం, పుట్టపర్తి పట్టణాల్లోనిః రేషన్ షాపుల ద్వారా జనవరి నుంచి గోధుమ పిండి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కేంద్రంలోని 41 వేల మంది కార్డుదారులకు కిలో ప్యాకెట్లు అందజేయనున్నారు. డిమాండ్‌ను బట్టి గ్రామాల్లోనూ సరఫరా చేయనున్నారు. అయితే, జనవరి 1 నుంచి పంపిణీ ప్రారంభం కావాల్సి ఉండగా.. శుక్రవారం వరకు డీలర్ల వద్దకు సరకు చేరలేదని స్థానికులు పేర్కొంటున్నారు.
News December 26, 2025
గుంటూరులో ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకిరెడ్డిపాలెం హైవేలో శుక్రవారం ఉదయం ఘోరప్రమాదం జరిగింది. తెలంగాణలోని సూర్యాపేట వాసులు తిరుపతికి వెళ్లొచ్చే క్రమంలో కారును అంకిరెడ్డిపాలెం టయోటా షోరూమ్ దగ్గర ఆపారు. ఈ క్రమంలో వారి కారును ప్రైవేట్ బస్సు ఢీకొట్టగా సుశీల(64), వెంకయ్య(70), మహేశ్(28) ఘటనా స్థలంలోనే మృతిచెందారు. మృతదేహాలను పోలీసులు బయటకు తీసి మార్చురీకి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 26, 2025
మానేరు నదిపై హైలెవెల్ వంతెన.. తగ్గనున్న దూరభారం

కాటారం మండలం దామెరకుంట మంథని మండలం వెంకటాపూర్ గ్రామాల మధ్య మానేరు నదిపై హైలెవెల్ వంతెన నిర్మాణంతో అటవీ గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. తద్వారా కాలేశ్వరం వెళ్ళేందుకు మరో రహదారి సిద్ధమవడంతో పాటు 25 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. కాలేశ్వరం అభివృద్ధి, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల జాతీయ రహదారులకు అనుసంధానంగా మారుతుంది.


