News December 11, 2025

HYD: పల్లె పోరుకు ‘పట్నం’ వదిలి!

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నేడు తొలి విడత పోలింగ్ జరగనుంది. పట్నంలో ఉంటున్న ఇతర జిల్లాల వాసులు పల్లె పోరు కోసం కదిలారు. కొంతమంది సర్పంచ్ అభ్యర్థులు సిటీలో ఉంటున్న బ్యాచ్‌లర్స్‌‌కు ఛార్జీల కోసం ఆన్‌లైన్‌లో అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసి మరీ ఓటేసి పోవాలని కోరడం గమనార్హం. ‘ఏదైతేనేం.. ఓసారి మా ఊరు రాజకీయం చూద్దాం’ అని వేలాది మంది పల్లె బాట పట్టారు. వారు పని చేసే సంస్థలు కూడా సెలవులకు ఓకే చెప్పేశాయ్.

Similar News

News December 11, 2025

జీహెచ్‌ఎంసీ వార్డులపై ఫిర్యాదుల ‘సునామీ’

image

GHMC పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియపై అభ్యంతరాల పర్వం మొదలైంది. 300 వార్డులుగా డీలిమిటేషన్ చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్ జారీ అవగా దీనిపై నిరసన గళం వినిపిస్తోంది. ప్రోఫార్మా-III ద్వారా అందిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 10న ఏకంగా 40 ఫిర్యాదులు నమోదయ్యాయి. ముసాయిదా నోటిఫికేషన్‌లో పేర్కొన్న వార్డుల సరిహద్దులు, జనాభా లెక్కలపై రాజకీయ పక్షాలు, స్థానిక ప్రజల నుంచి భారీగా విమర్శలు వస్తున్నాయి.

News December 11, 2025

HYDలో రెన్యువల్‌కు డిసెంబర్ 20 లాస్ట్ డేట్!

image

GHMC పరిధిలోని వ్యాపార సంస్థలు 2026 సంవత్సరానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్‌లను డిసెంబర్ 20 లోపు రెన్యువల్ చేసుకోవాలని GHMC విజ్ఞప్తి చేసింది. ఈ తేదీలోగా రెన్యువల్ చేసుకుంటే ఎలాంటి పెనాల్టీ ఉండదు. డిసెంబర్ 21 నుంచి ఫిబ్రవరి 19 వరకు 25% పెనాల్టీ, ఆ తర్వాత 50% పెనాల్టీ ఉంటుందని GHMC స్పష్టం చేసింది. పెనాల్టీలను నివారించడానికి గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని వ్యాపారులకు సూచించింది.

News December 10, 2025

HYDలో ​నైట్ లైఫ్‌కు కేఫ్ కల్చర్ కిక్

image

HYD టెక్ స్టూడెంట్స్, క్రియేటర్స్ ‘కేఫ్ కల్చర్’ని కొత్త అడ్డాగా మార్చుకున్నారు. పగలు లాప్‌టాప్‌లతో కో-వర్కింగ్ సెంటర్లుగా, నైట్ బోర్డ్ గేమ్స్, ఓపెన్ మైక్స్, ఇండీ మ్యూజిక్ గిగ్స్‌తో సందడి చేస్తున్నారు. PUBలకు భిన్నంగా ఈ హాట్‌స్పాట్‌లు ఉంటాయి. వైన్-డైన్‌కు బదులు కాఫీ, ఫుడ్‌తో యూత్‌ని ఆకర్షిస్తున్నాయి. మద్యం లేకుండా క్రియేటివిటీ, కమ్యూనిటీతో మజా డబుల్ అవుతోంది. దీన్నే స్టడీ పార్టీ అని పిలుస్తున్నారు.