News September 2, 2024
HYD: పసి పిల్లలను పొట్టనబెట్టుకుంటున్నారు..!

ఆర్థిక ఇబ్బందులతో ఇంటి పెద్దలు కుటుంబాలను చిదిమేస్తున్న ఘటనలు HYDలో పెరుగుతున్నాయి. జీడిమెట్ల పరిధిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వెంకటేష్ భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి, ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్‌లో నష్టపోవడమే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పటాన్‌చెరులోని రుద్రారంలో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి అనంతరం తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలవరపెడుతోంది.
Similar News
News March 9, 2026
HYD: నేడు స్కాట్లాండ్‌తో భారత్ ఢీ

మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ 2026లో భాగంగా నేడు భారత్, స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో ఈ కీలక మ్యాచ్ జరగనుంది. పూల్-బీలో ఇప్పటికే ఒక విజయం సాధించిన భారత మహిళల జట్టు రెండో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు స్కాట్లాండ్ జట్టు కీలక పాయింట్ల కోసం పోరాడనుంది. ఉత్కంఠభరితంగా సాగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 గం.కు ప్రారంభం కానుంది.
News March 9, 2026
HYD: చెత్త కనిపిస్తే వాట్సాప్ చేయండి

పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో ప్రజలు కార్యాలయాల దాకా రాకుండానే పారిశుద్ధ్య సమస్యలు తెలియజేసేందుకు వాట్సాప్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. రోడ్లపై చెత్త పేరుకుపోయినా, చెత్త బిన్లు నిండిపోయినా, నాలాల్లో వ్యర్థాలు ఉన్నా ఫొటో తీసి, లొకేషన్‌తో వాట్సాప్ నంబర్‌కు పంపాలన్నారు. ఈ నంబర్లు సేవ్ చేసుకోండి
GHMC: 8125966586
మల్కాజిగిరి: 9063421300
సైబరాబాద్: 9063421347
News March 9, 2026
HYD: 20 కిలోల టమాట రూ.60.. రైతుల ఆవేదన!

HYDలో టమాట ధరలు రోజు రోజుకు పడిపోతున్నాయి. బోయిన్‌పల్లి మార్కెట్‌లో గత 3, 4 రోజులుగా టమాట ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం 20 కిలోల టమాట క్రేట్ ధర కేవలం రూ.60 నుంచి రూ.150 మధ్య మాత్రమే పలుకుతోంది. సరఫరా ఎక్కువగా రావడం, వివాహాది శుభకార్యాలు ఇంకా మొదలవ్వకపోవడంతో వినియోగం తగ్గి ధరలు పడిపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


