News August 21, 2025
HYD: పాదచారి భద్రతకు FOBలు ప్రైవేట్ సంస్థలకు

మహానగర రోడ్లపై ఎటుచూసినా వాహనాలే.. పాదచారులు రోడ్డు దాటుదామంటే నరకమే..అందుకే గ్రేటర్ వ్యాప్తంగా 32 ఫుట్ ఓవర్ బ్రిడ్జి(FOB)లను గతంలో నిర్మించారు. అయితే నిర్వహణ మాత్రం గాలికొదిలేశారు. ఇపుడు వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని GHMC నిర్ణయించింది. FOBల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు నోటిఫికేషన్ జారీచేసింది. ఇవి అందుబాటులోకి వస్తే నగరంలో పాదచారి కష్టాలు కాస్త తీరినట్టే.
Similar News
News August 21, 2025
HYD: ఎవడ్రా నువ్ KTR: గజ్జెల కాంతం

TPCC ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ఈరోజు గాంధీభవన్‌లో మాట్లాడారు. ‘దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్.. అంత గొప్ప పార్టీని థర్డ్ క్లాస్ పార్టీ అంటావా ఎవడ్రా నువ్ KTR.. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే నీ అయ్య KCR ఈ జన్మలో CM కాకపోతుండే, నువ్ మంత్రి కాకపోతుండే.. థర్డ్ క్లాస్ నా కొడుకులు మీరు.. నీ అయ్య చీప్ లిక్కర్ తాక్కుంటా పండి, తాగుబోతు పార్టీ పెట్టిండు.. నీ అయ్య చరిత్ర తెలుసుకో’ అని అన్నారు.
News August 21, 2025
HYD: ఇంటర్ అడ్మిషన్లకు ఆగస్టు 31 వరకు అవకాశం

2025-26 విద్యా సంవత్సరంలో ఇంకా ఇంటర్‌లో చేరని విద్యార్థులకు బోర్డు గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ నెల 31లోపు తమకు నచ్చిన కళాశాలల్లో అడ్మిషన్ తీసుకోవచ్చని పేర్కొంది. ఆయా కళాశాలల ప్రిన్సిపళ్లు విద్యార్థులకు సహకరించాలని కోరింది. ఇదిలా ఉండగా జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ తీసుకునే సమయంలో సంబంధిత కాలేజీకి బోర్డు గుర్తింపు ఉందో, లేదో పరిశీలించాలని తల్లిదండ్రులకు సూచించింది.
News August 21, 2025
HYDలో SMART మీటర్ వాల్వ్‌లు వస్తున్నాయి!

జలమండలి పరిధిలో దాదాపుగా 5,000 వరకు గృహాలకు సరఫరా చేసేందుకు మెయిన్ వాల్వ్‌లు ఉన్నాయి. వీటిలో మొదట 1000 వాల్వ్‌లను స్మార్ట్ వాల్వ్‌లుగా మార్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. స్మార్ట్ ఆటోమేటిక్ వాల్వ్‌లతో నిర్ణీత సమయంలో నీటిని సరఫరా చేయడం, నాణ్యత గుర్తించడం, ఇతర సమస్యలకు చెక్ పెట్టొచ్చనే నేపథ్యంలో వాటిపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.