News June 20, 2024

HYD: పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి: MRPS

image

రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశంలో పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లను పరిష్కరించేలా నిర్ణయాలు తీసుకోవాలని తెలంగాణ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. HYD విద్యానగర్‌లోని సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్‌ చేసి వేతనాలు పెంచాలన్నారు. కార్మికులకు రూ.5 వేల పెన్షన్‌ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Similar News

News October 17, 2025

HYD: ECకి నేరచరిత్ర చెప్పని అభ్యర్థులు

image

ఎన్నికల సమయంలో కచ్చితంగా నేర చరిత్ర ఎన్నికల సంఘానికి చెప్పాలి.. అయితే ఇప్పటి వరకు కొందరు అభ్యర్థులు తమ నేరచరిత్రను చెప్పలేదు. లోక్‌సభ ఎన్నికల్లో HYD నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్లో ఏడుగురికి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. అయితే ఇప్పటి వరకు కేవలం నలుగురు మాత్రమే వివరాలు సబ్మిట్ చేశారు. ఇక చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల్లో ఏడుగురికి నేరచరిత్ర ఉంటే ముగ్గురే వివరాలు అందించారు.

News October 17, 2025

కేబినెట్ సబ్ కమిటీకి మెట్రో కమిటీ నివేదిక

image

హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే మెట్రో కమిటీ తన నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వనుంది. మెట్రో కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ సబ్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి నిపుణులతో మాట్లాడుతుంది. సాధ్యాసాధ్యాలపై కూలంకుశంగా విచారించి ఓ నిర్ణయం తీసుకుంటుంది. దానిపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ తతంగం సాధ్యమైనంత తొందరగా పూర్తిచేయాలని సర్కారు భావిస్తోంది.

News October 17, 2025

HYD: నిమ్స్‌లో అనస్థీషియా విద్యార్థి అనుమానాస్పద మృతి

image

పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో అనస్థీషియా వైద్య విద్యార్థి నితిన్ అనుమానాస్పద మృతి చెందాడు. నిన్న రాత్రి విధులకు హాజరుకాగా.. ఇవాళ ఉదయం ఆపరేషన్ థియేటర్లో విగతజీవిగా పడి ఉన్నాడు. ఆస్పత్రి సిబ్బంది సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద మృతి పట్ల పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.