News April 3, 2024

HYD: పార్లమెంట్‌లో తెలంగాణ గొంతును వినిపిస్తాం: MLA

image

పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతును BRS పార్టీ నేతలు వినిపిస్తారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. HYD చింతల్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో భాగంగా రంగారెడ్డి నగర్ డివిజన్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం జరిగింది. కార్యకర్తలు, ప్రజలందరూ తోడుగా ఉంటే న్యాయం కోసం ఎంతవరకైనా పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు.

Similar News

News February 17, 2026

HYD: జేఈఈ మెయిన్స్‌లో Resonance ప్రభంజనం!

image

JEE మెయిన్‌ 2026 సెషన్‌-1 ఫలితాల్లో హైదరాబాద్‌ Resonance విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. 55 మందికి పైగా విద్యార్థులు 99 పర్సెంటైల్‌కు మించి స్కోరు చేసి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. సమృద్ధి భట్టాచార్య 99.988, రేవంత్ వంగల 99.982, సాకేత్ రెడ్డి 99.932, ఆదిత్య రెడ్డి 99.918, అన్విత రెడ్డి 99.915 అగ్రస్థానంలో నిలిచారు. క్రమశిక్షణతో కూడిన శిక్షణే ఈ విజయానికి కారణమని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

News February 16, 2026

BREAKING: కడ్తాల్ వద్ద రెండు కార్లు ఢీ.. ఇద్దరి దుర్మరణం

image

కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్కల్ పహాడ్ గేట్ సమీపంలో ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. NH 765పై రెండు కార్లు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కార్లలో ప్రయాణిస్తున్న నరేంద్ర చారి (37), ఎస్‌కే సైదులు (30) అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.