News February 13, 2025
HYD: పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739421552422_51459681-normal-WIFI.webp)
తరచుగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోందని ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ డా.గోపాలకృష్ణ అన్నారు. బాచుపల్లిలో ఆయన మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. తమ అభిరుచులను పిల్లలమీద రుద్దకుండా వారికి ఇష్టమైన సబ్జెక్టు ఎంచుకునే అవకాశం ఇవ్వడంతో పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని చెప్పారు.
Similar News
News February 13, 2025
భీంపూర్‌లో చిరుత.. స్పందించిన అధికారులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739429822925_50039127-normal-WIFI.webp)
భీంపూర్ మండలంలోని నిపాని గ్రామ శివారులో చిరుత పులి కదలిక పై ఎఫ్ఎస్‌వో అహ్మద్ ఖాన్, ఎఫ్‌బీవో శ్రీనివాస్ స్పందించారు. నిపాని శివారులోని లింగారెడ్డి అనే రైతుకు చెందిన పంట చేనులో చిరుత పులి సంచారం సీసీ కెమెరాలో రికార్డయిందన్నారు. గురువారం పంట చేనుకు వెళ్లి పరిశీలించారు. రైతులెవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News February 13, 2025
MDK: బర్డ్ ఫ్లూ దెబ్బ.. చికెన్ ధరలు అబ్బా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739420459757_1243-normal-WIFI.webp)
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ భయంతో పలు ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయి ధరలు అమాంతం తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం కేజీ రూ.220 ఉండగా ప్రస్తుతం రూ.170గా ఉంది. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా వ్యాధి లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా పశువైద్యాధికారులు తెలిపారు.
News February 13, 2025
ఉడికించిన చికెన్, గుడ్లు తినొచ్చు: మంత్రి అచ్చెన్న
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739432908392_653-normal-WIFI.webp)
AP: బర్డ్‌ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఉడికించిన చికెన్, గుడ్లు తింటే ప్రమాదం ఏమీలేదని తేల్చి చెప్పారు. బర్డ్‌ఫ్లూపై సోషల్ మీడియా, కొన్ని పత్రికలు భయాందోళనలు సృష్టిస్తున్నాయని, అలాంటి వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రం, శాస్త్రవేత్తలతో చర్చించామని, కోళ్లకు వ్యాధి సోకిన ప్రాంతానికి ఒక కి.మీ పరిధికే ఇది పరిమితం అవుతుందని చెప్పినట్లు వెల్లడించారు.