News August 23, 2025
HYD: పీజీ కోర్సుల కౌన్సెలింగ్ షెడ్యుల్ విడుదల

ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యుల్‌ను విడుదల చేశారు. MSc బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫార్మషుటికల్ కెమిస్ట్రీ, ఎంఏ ఎకనామిక్స్ ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి సీపీగేట్- 2025 అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని కన్వినర్ ప్రొ.పాండురంగారెడ్డి తెలిపారు. వివరాలకు ఉస్మానియా వెబ్‌సైట్‌లో చూడాలన్నారు.
Similar News
News August 23, 2025
బెట్టింగ్ కేసులో కాంగ్రెస్ MLA అరెస్ట్

బెట్టింగ్ కేసులో కర్ణాటక(చిత్రదుర్గ) కాంగ్రెస్ MLA వీరేంద్రను ED అరెస్ట్ చేసింది. ఈయన సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో క్యాసినో నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. రూ.12కోట్ల నగదు, రూ.6కోట్ల బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. ఈయన సోదరుడు, సన్నిహితులు బెట్టింగ్ యాప్‌లు నిర్వహిస్తున్నట్లు గుర్తించి వారి బ్యాంక్ ఖాతాలు సీజ్ చేశారు. ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చిన కొద్దిగంటల్లోనే అరెస్ట్ చేయడం గమనార్హం.
News August 23, 2025
ఏలూరు: ‘దివ్యాంగులు ఆందోళన చెందొద్దు’

అర్హత ఉన్న ఏ ఒక్కరి పెన్షన్ రద్దు కాదని డీఆర్డిఏ పీడీ విజయరాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఈ విషయంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. దివ్యాంగుల పింఛన్ పరిశీలనలో హాజరైన వారిలో 40% కంటే తక్కువ ఉన్నవారికి నోటీసులు జారీ చేశామన్నారు.నోటీసులు ఇచ్చిన వారందరికీ పునరుద్ధరణకు అప్పీలు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాల కొరకు ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయం సంప్రదించమన్నారు.
News August 23, 2025
మహబూబ్‌నగర్: ‘ఓ గొప్ప నాయకుడిని కోల్పోయాం’

దేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందని ఎంపీ డీకే అరుణ అన్నారు. మాజీ ఎంపీ, పాలమూరు జిల్లా ముద్దుబిడ్డ, సీపీఐ అగ్రనేత, కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల ఆమె శనివారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి జాతీయస్థాయి నేతగా ఎదిగిన గొప్ప నాయకుడు ఎన్నో వామపక్ష ఉద్యమాలు,ప్రజా పోరాటాలతో సురవరం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.