News October 6, 2025

HYD: పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల గడువు పొడిగింపు

image

HYD రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2025-26 విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న పీజీ (రెగ్యులర్, ప్రత్యేక కోటా), పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు దాఖలు చేసుకునే గడువుని పొడిగించినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ G.E.Ch.విద్యాసాగర్ ఈరోజు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఈనెల 12వ తేదీ సా.5 గంటల వరకు దాఖలు చేసుకోవచ్చని ఆయన చెప్పారు.

Similar News

News October 6, 2025

HYD: హైడ్రా ప్రజావాణికి 41 ఫిర్యాదులు

image

HYDలోని హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో 41 ఫిర్యాదులు వచ్చినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రజావాణిలో భాగంగా అనుమతులు లేని లేఅవుట్లతో పాటు రహదారుల ఆక్రమణలపై ఫిర్యాదులు అందినట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఫిర్యాదులను పరిశీలించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News October 6, 2025

HYD: విద్యారంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది: కోమటిరెడ్డి

image

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈరోజు ఖైరతాబాద్ నియోజకవర్గం ఎర్రమంజిల్‌లో ప్రభుత్వ నూతన పాఠశాల భవనాన్ని స్థానిక MLA దానం నాగేందర్, MLC రియాజుల్ హాసన్, జిల్లా కలెక్టర్ హరిచందనతో కలిసి మంత్రి ప్రారంభించి మాట్లాడారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

News October 6, 2025

HYD: జూబ్లీహిల్స్‌లో పోస్టర్లు, బ్యానర్లను తొలగిస్తాం: కర్ణన్

image

నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా వెంటనే పోస్టర్లు, బ్యానర్లను తొలగిస్తామని, నవంబర్ 14వ తేదీన నగరంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి మైదానంలో ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఈసీ నిబంధనలను అందరూ పాటించాలని సూచించారు.