News February 15, 2025
HYD: పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశం

గచ్చిబౌలిలోని ప్రీజం పబ్‌లో ప్రభాకర్ పోలీసులపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు ప్రభాకర్‌ను విచారణ నిమిత్తం 3 రోజులు కస్టడీకి తీసుకోగా.. శుక్రవారం ముగిసింది. ఆయనను CCS, గచ్చిబౌలి పోలీసులు వివిధ కోణాల్లో విచారించి వివరాలను సేకరించారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 80కి పైగా కేసుల్లో నిందితుడైన ఇతడిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశం ఉంది.
Similar News
News November 8, 2025
48 గంటల్లో ఆలయాలు కట్టించాలి.. బండి సంజయ్ వార్నింగ్

రామగుండంలో 46 మైసమ్మ ఆలయాల కూల్చివేతపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రఆగ్రహం వ్యక్తంచేశారు. పెద్దపల్లి కలెక్టర్ శ్రీహర్ష, రామగుండం కమిషనర్ అరుణశ్రీలకు ఫోన్ చేసి మండిపడ్డారు. రోడ్డు విస్తరణకు మసీదులను వదిలి, హిందూ ఆలయాలనే ఎందుకు కూల్చారని ప్రశ్నించారు. ‘48 గంటల్లో కూల్చిన ఆలయాలను పునరుద్ధరించాలి లేదా మసీదులను కూల్చివేయాలి. లేదంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత నేనే వచ్చి తేలుస్తా’ అని హెచ్చరించారు.
News November 8, 2025
గిరిజన భాషల ఉత్సవాలకు ఉట్నూర్ వాసి

జాతీయస్థాయి గిరిజన భాషల ఉత్సవాలు ఈనెల 11, 12న న్యూఢిల్లీలో జరగనున్నాయి. నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ఉట్నూర్‌కు చెందిన బంజారా రచయితా డా.ఇందల్ సింగ్‌ను ఆహ్వానించారు. జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమంలో గిరిజన భాషల ఔన్నత్యాన్ని తెలిపే అవకాశం లభించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
News November 8, 2025
తానూరు: దాబాలో ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య

తానూరు మండలం బామ్ని గ్రామానికి చెందిన బాశెట్టి రాజు(41) భోసి గ్రామ సమీపంలోని ఓ దాబాలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాశెట్టి రాజు కొద్ది రోజులుగా దాబాలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం దాబాలో అర్ధరాత్రి దాటిన తర్వాత రాజు మద్యం మత్తులో ఉరేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


