News September 20, 2025
HYD: పుట్టినరోజు వేడుకకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

ఆర్టీఏ కమిషనర్, సీనియర్ జర్నలిస్ట్ పీవీ శ్రీనివాస్ మనవరాలి పుట్టినరోజు వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రత్యేకంగా హాజరయ్యారు. బంజారాహిల్స్‌లో వారి కుటుంబ సభ్యులతో కలిసి సీఎం కేక్ కట్ చేసి చిన్నారిని ఆశీర్వదించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్నారికి చదువులో, జీవితంలో మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News September 20, 2025
HYD: కొత్త డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుపై హెల్త్ మినిస్టర్ సమీక్ష

వైద్య వ్యవస్థలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందని హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలో కొత్త డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుపై ఉన్నతాధికారులతో ఈరోజు HYDలోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీస్‌లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కిడ్నీ జబ్బులు, డయాలసిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న తీరును అధికారులు మంత్రికి వివరించారు. 2009లో ఈ సేవలు ప్రారంభించినప్పుడు 1,230 మంది డయాలసిస్ పేషెంట్లున్నారన్నారు.
News September 20, 2025
HYD: బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క సందడి

బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. శనివారం HYD నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. కళాశాల విద్యార్థులతో కలిసి ఆటపాటలతో మంత్రి సందడి చేశారు. మహిళా కోఆపరేటీవ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ శోభారాణి, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రముఖర్జీ పాల్గొన్నారు.
News September 20, 2025
HYD: బతుకమ్మను జాతీయ పండుగగా గుర్తించాలి: జాజుల

బతుకమ్మను జాతీయ పండుగగా గుర్తించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈనెల 24న ట్యాంక్‌బండ్ బతుకమ్మ ఘాట్ వద్ద నిర్వహించ తలపెట్టిన బతుకమ్మ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్‌లో పోస్టర్‌ను సంఘం రాష్ట్ర మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గనుల స్రవంతి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ తదితరులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.