News September 20, 2025

HYD: పుట్టినరోజు వేడుకకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

image

ఆర్టీఏ కమిషనర్, సీనియర్ జర్నలిస్ట్ పీవీ శ్రీనివాస్ మనవరాలి పుట్టినరోజు వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రత్యేకంగా హాజరయ్యారు. బంజారాహిల్స్‌లో వారి కుటుంబ సభ్యులతో కలిసి సీఎం కేక్ కట్ చేసి చిన్నారిని ఆశీర్వదించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్నారికి చదువులో, జీవితంలో మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News September 20, 2025

HYD: రాత్రుళ్లు వస్తున్నారు.. జర జాగ్రత్త..!

image

రాత్రుళ్లు ఇళ్లలో దొంగతనాల కేసుల్లో ముగ్గురు నిందితులను HYD హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 22.6 తులాల బంగారం, 6 తులాల వెండి, రూ.3 లక్షల నగదు, కారును వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్థుడు మాండ్ల శివ జైలులో పరిచయమైన వారితో కలిసి గ్రేటర్ HYD పరిధిలో మళ్లీ దొంగతనాలు చేస్తున్నాడు. బంజారా కాలనీ, RTC మజ్దూర్ నగర్, జయసూర్య నగర్ తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి చొరబడి చోరీ చేస్తున్నారు.

News September 20, 2025

వరంగల్ జిల్లాకు వర్ష సూచన..!

image

వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఏ సమయంలోనైనా తుపాన్ ముప్పు, ఏ క్షణమైనా అతి తీవ్ర వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. భారీ వరదలు, తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుందని, ఈనెల 27 వరకు ఏ రోజైనా, ఎక్కడైనా అతి తీవ్ర వర్షం కురిసే అవకాశాలు కల్పిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.

News September 20, 2025

HYD: కొత్త డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుపై హెల్త్ మినిస్టర్ సమీక్ష

image

వైద్య వ్యవస్థలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందని హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలో కొత్త డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుపై ఉన్నతాధికారులతో ఈరోజు HYDలోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీస్‌లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కిడ్నీ జబ్బులు, డయాలసిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న తీరును అధికారులు మంత్రికి వివరించారు. 2009లో ఈ సేవలు ప్రారంభించినప్పుడు 1,230 మంది డయాలసిస్ పేషెంట్లున్నారన్నారు.